ఎదిగినా: తండ్రి ఆటోలో వచ్చిన భారత మహిళా క్రికెటర్
విజయవాడ: భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి వచ్చిన ఏ క్రికెటర్‌కైనా ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభిస్తుంది. ఆ తర్వాత ఏ విలాసవంతమైన కారులోనో ఇంటికి చేరుకుంటారు. అయితే భారత మహిళా జట్టులో సభ్యురాలైన తెలుగు యువతి మాత్రం తండ్రి ఆటోలోనే ఇంటికి వెళ్లి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకుంది.
ఆమె ఎవరో కాదు, టీమిండియా మహిళా క్రికెట్ జట్టు వికెట్ కీపర్, విజయవాడ క్రీడాకారిణి కల్పన. బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొని గురువారం తిరిగొచ్చిన కల్పనకు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరావు, ఆమె చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మాత్రమే వచ్చారు.

భారత విజయంలో పాలుపంచుకున్న ఆమెకు వారందరూ అభినందనలు తెలిపారు. కాగా, తన తండ్రి నడిపే ట్రాలీ ఆటోలోనే ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి బయలుదేరింది కల్పన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది తన వ్యక్తిత్వమని కల్పన చాటుకున్నారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టు 3-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యుత్తమంగా రాణించిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications