Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంద్రాణీ ఎమోషనల్ లేఖ: సూసైడ్‌యత్నంపై ప్రశ్నలు!

ముంబై: షీనా బోరా హత్యలో ప్రథమ ముద్దాయి, తల్లి ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె నిజంగానే ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక హత్యాయత్నం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

షీనా బోరా హత్య మిష్టరీ చిక్కును విప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాజాగా, నెల రోజులుగా జైలులో ఉన్న ఇంద్రాణి హఠాత్తుగా ఆత్మహత్యాయత్నం చేసింది. నిన్నటి వరకు ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. ఆమె వైద్యానికి స్పందిస్తోందని ఆదివారం నాడు వైద్యులు చెప్పారు.

అయినప్పటికీ, ఆమె పరిస్థితి విషమంగానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంద్రాణి ఆత్మహత్యాయత్నంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

Indrani: After murder, now suicide angle troubles probe agencies

ఆమె నిజంగానే ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక ఎవరైనా చంపే ప్రయత్నం చేశారా? ఆమెకు అన్ని నిద్రమాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేక రోజువారీగా వేసుకోవాల్సిన నిద్రమాత్రలు ఆమె వద్ద ఉండటంతో ఒకేసారి వేసుకుందా? కేసు నుంచి తప్పించుకునే వ్యూహమా? అన్ని నిద్రమాత్రలు ఎవరిచ్చారు? అనే చర్చ సాగుతోంది.

రెండు రోజుల క్రితం ఇంద్రాణి తల్లి చనిపోయింది. అది తెలిసినప్పటి నుంచి ఆమె కుంగిపోయిందని అంటున్నారు. ఆమె కొద్ది రోజులుగా ఎపిలెప్సీతో బాధపడుతోందని, నెల రోజులుగా మందు బిళ్లలు వాడుతోందని చెబుతున్నారు.

మరోవైపు, ఇంద్రాణికి ఎలాంటి రోగం లేదని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కూడా కాదని ఇంద్రాణీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు, తాను భర్తను కలుసుకోవాలని మూడుసార్లు ఎమోషనల్‌గా ఆమె ఉత్తరాలు రాసినప్పటికీ భర్త స్పందించలేదని అంటున్నారు. అయితే, ఆయన మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+