బాలీవుడ్లో మో'ఢీ':వివేక్ఒబెరాయ్, మాధుర్ కౌంటర్
బాలీవుడ్‌లో 'రాజకీయ లౌకికవాద' విభేదాలు రాజుకున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు విషయంలో బాలీవుడ్‌లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. లౌకికవాద అభ్యర్థికే ఓటు వేయాలని కొంతమంది బాలీవుడ్ నటులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో నటుడు వివేక్ ఒబేరాయ్, దర్శకులు మాధుర్ భండార్కర్ తదితరులు మోడీకి తమ మద్దతును ప్రకటించారు. లౌకికవాద అభ్యర్థికి మద్దతు పలకాలనే విజ్ఞప్తి కారణంగానే తాము బాహాటంగా మోడీకి మద్దతు ఇస్తున్నామని భండార్కర్ ఈ సందర్భంగా తెలిపారు.

మహేష్ భట్, నందితా దాక్, జోయా అక్తర్, గాయని శుభా ముద్గల్ తదితరులు తొలుత లొకికవాద అంశాన్ని తెర పైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మోడీకి మద్దతు పలికిన వారిలో వివేక్ ఒబెరాయ్, మాధుర భండార్కర్‌లతో పాటు వివేక్ అగ్నిహోత్రి, అశోక్ పండిట్, విక్రమ్ ఫడ్నిస్ తదితరులు ఉన్నారు.
ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు చెప్పాల్సిన హక్కు తమకు లేదనీ, దీనిలో కొందరు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని మాధుర్ భండార్కర్ అన్నారు.
బాలీవుడ్ ఎప్పుడూ ఒక నటుడు వైపు గానీ, ఓ పార్టీ వైపు గానీ వెళ్లిన దాఖలాలు లేవిని అశోక్ పండిట్ అన్నారు.లౌకికవాదం పేరిట ఆడుతున్న ఆట ఇది అన్నారు. ఓటు ఎవరికి వేయాలో చెబుతూ ప్రజలను గందరగోళపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు.
-
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications