ఇవాంక డ్రెస్‌పై పెదవి విరిచిన విదేశీ మీడియా
ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ ధరించిన దుస్తులపై విదేశీ మీడియా విమర్శలు చేసింది.
Recommended Video

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ ధరించిన దుస్తులపై విదేశీ మీడియా విమర్శలు చేసింది. హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టినపుడు ధరించిన తెల్లటి ముత్యాలు కలిగిన నల్లని కోటు భారతీయత ఉట్టిపడేలా ఉందని అంటూనే మంగళవారం ధరించిన దుస్తులపై పెదవి విరిచింది.
జీఈఎ్‌సకు హాజరైనపుడు ధరించిన ఆకు పచ్చ గౌను హుందాగా లేదని విదేశీ మీడియా విమర్శించింది. ఆకుపచ్చ రంగుతో సిల్కు బట్ట అద్భుతంగా ఉంది గానీ దానిపై ఉన్న పసుపు రంగు, గులాబీ రంగు పూలతో సిల్కు వల్ల సహజత్వం పోయిందని వెల్లడించింది.

ఇది బాగా లేదు..
మెడను పూర్తిగా కప్పి ఉంచేలా నెక్, ఛాతి వద్ద ఉన్న రంధ్రం ఏ మాత్రం నప్పలేదని, మోకాళ్లను, మోచేతులను కప్పేలా ఉన్న ఆ డ్రెస్ డిజైన్ జపాన్ సంప్రదాయ దుస్తులు కిమోనో మాదిరిగా ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడింది.

మరీ అధ్వాన్నం
ఇవాంక తొలిసారి ధరించిన డ్రెస్‌కు, రెండో సారి ధరించిన డ్రెస్‌కు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించింది. మొత్తంగా ఆ గౌను ఏమాత్రం గుర్తుండిపోయేలా లేదని అభిప్రాయపడింది ఆమె ధరించిన బూట్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపింది. ఆ ఆకుపచ్చ డ్రెస్‌కు, నల్లని షూ అవగాహనలేమిని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించింది.

అది సరిపోతుందా...
పేద మహిళల సాధికారత కోసం మాట్లాడిన ఇవాంక ట్రంప్ చర్యలు అందుకు అనుగుణంగా లేవని అభిప్రాయపడింది. జీఈఎస్‌కు హాజరైన ఇవాంక ట్రంప్ భారతదేశంలోని మీడియాలో పతాకశీర్షికలకు ఎక్కారు గానీ పేద మహిళల సాధికారతను సాధించడానికి అనుగణమైన చర్యలు ఆమె ప్రదర్శించలేకపోయారని వ్యాఖ్యానించింది.

ఆ విషయం మాట్లాడలేదు..
మహిళల అభివృద్ధి గురించి మాట్లాడిన ఇవాంక ట్రంప్ తన తన దుస్తులు కుట్టినవారికి భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ తక్కువ వేతనాలు లభిస్తున్ని విషయాన్ని ప్రస్తావించలేదని మీడియా విమర్శించింది. ఆమె పర్యటనలో అమెరికా విదేశీ వ్యవహారాల ప్రముఖులు లేకపోవడాన్ని కూడా ప్రస్తావించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications