ఫోన్: మమతా బెనర్జీతోనూ వైయస్ జగన్ దోస్తీ?

అదలా ఉంటే, వైయస్ జగన్ తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి బుధవారం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆనందబజార్ పత్రికలో గురువారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది. రాష్ట్రాల విభజనకు తాము మొదటి నుంచీ వ్యతిరేకమని, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమానికి తన నైతిక మద్దతు ఉంటుందని మమతా బెనర్జీ జగన్‌తో చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గూర్ఖాలాండ్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెసు తీసుకున్న నిర్ణయం పట్ల మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైయస్ జగన్‌ను తాము జాతీయ స్థాయిలో పెట్టబోయే ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని మమతా బెనర్జీ కోరారు. ఈ విషయంపై మమతా బెనర్జీ విజయమ్మకు ఫోన్ చేశారు. ఆ సంఘటన తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.
విజయమ్మ ఢిల్లీలో బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను, వామపక్షాల నేతలు జి రాజా, ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరిలను కలిసి సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. బిజెపితో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడు మాట్లాడడం సరి కాదని, రాష్ట్రం మండుతుంటే పొత్తుల గురించి మాట్లాడడం సరి కాదని వైయస్ జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications