టాప్-10 ఆదాయ పన్ను: మూడో స్థానంలో జగన్

సమాచార హక్కు చట్టం కార్యకర్త సుభాష్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు ఆదాయపు పన్ను శాఖ అన్ని విభాగాల్లోను టాప్ 10 మంది పన్ను చెల్లింపుదారుల పేర్లను ప్రకటించింది. వ్యక్తిగత విభాగంలో జగన్‌తో పాటు బొగ్గు కుంభకోణంలో సిబిఐ దర్యాఫ్తును ఎదుర్కొంటున్న కమల్జీత్ సింగ్ అహ్లూవాలియా, ప్రశాంత్ అహ్లూవాలియా (కమల్ స్పాంజ్ స్టీల్, పవర్ డైరెక్టర్లు) కూడా ఉన్నారు.
అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వ్యక్తిగత విభాగంలో షిరీన్ అనే వ్యక్తి అగ్రస్థానంలో ఉండగా, కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ డైరెక్టర్ కమల్జీత్ సింగ్ అహ్లూవాలియా ద్వితీయ స్థానంలో ఉన్నారు. జగన్‌ది మూడో స్థానం. కమల్ స్పాంజ్ మరో డైరెక్టర్ ప్రశాంత్ అహ్లూవాలియా తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
మిగిలిన వారిలో రామమూర్తి ప్రవీణ్ చంద్ర, ఆసిమ్ ఘోష్, ఇంద్రాణి పట్నాయక్, ఎస్ మార్టిన్, మన్సూర్ నిజాం పటేల్, బవిహల్లి రుద్రగౌడలు ఉన్నారు. ట్రస్ట్ విభాగంలో అగ్రస్థానంలో బిసిసిఐ ఉంది. కంపెనీల్లో ఓఎన్జీసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మొదటి రెండు స్థానాల్లో ఉంది.












Click it and Unblock the Notifications