'రాజశేఖర్ క్రేజ్ జగన్‌ను బయటపెట్టింది!, పవన్ అంత స్ట్రాంగ్ కాదు'
'రాజశేఖర్ ను సినిమాలు చేసుకోమనండి.. మీరు మాత్రం రాజకీయాల్లోకి రండి' అని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాజశేఖర్ కి ఉన్న క్రేజ్ జగన్ ను బయటపెట్టిందని ఆమె పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్: అడపాదడపా రాజకీయాల్లో కనిపించినా.. క్రియాశీలక రాజకీయాల వైపు అడుగేయలేకపోయారు జీవితరాజశేఖర్. దూకుడైన మాటతీరుతో ఎంతటి విమర్శకైనా సిద్దపడటం జీవితారాజశేఖర్ ను కొన్నిసార్లు ప్రత్యేకంగా నిలబెడుతుంది. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్బంగా.. జీవిత రాజశేఖర్ తో పవన్, జగన్ గురించిన ప్రస్తావన లేవనెత్తగా.. వారిద్దరిపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

జనసేనలో చేరబోతున్నారా?:
జనసేన పార్టీలో చేరబోయే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అని జీవితారాజశేఖర్ ను ప్రశ్నించడంతో.. 'నో' అని సమాధానం చెప్పారు. తనకలాంటి ఉద్దేశ్యం లేదని, పవన్ ను మంచి హీరోగా భావిస్తా తప్పా, మంచి రాజకీయ నాయకుడుగా కాదని చెప్పారు. పవన్ రాజకీయంగా అంత బలంగా లేరని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈమధ్య కాలంలో పార్టీలు పెడుతున్న చాలామంది.. తమ పార్టీలను తీసుకెళ్లి వేరే వాటిల్లో కలిపేస్తున్నారని, పవన్ అలా చేయకుంటే బాగుంటుందని జీవితారాజశేఖర్ అభిప్రాయపడ్డారు.

జగన్ ను తిట్టేసి బయటకొచ్చాం:
జగన్ వైఖరి మాకు నచ్చకపోవడంతో.. ఆయన పార్టీ పెట్టకముందే తెగదెంపులు చేసుకున్నామని జీవితారాజశేఖర్ తెలిపారు. 'రాజశేఖర్ ను సినిమాలు చేసుకోమనండి.. మీరు మాత్రం రాజకీయాల్లోకి రండి' అని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాజశేఖర్ కి ఉన్న క్రేజ్ జగన్ ను బయటపెట్టిందని ఆమె పేర్కొనడం గమనార్హం.
జగన్ అరెస్టవడంలో తప్పేమి కనిపించలేదని, ఆయన అవినీతికి పాల్పడినట్టుగా తాము భావించామని జీవితారాజశేఖర్ పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత అదెలా సాధ్యం?
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు జీవితారాజశేఖర్. ఓవైపు పెద్ద నోట్లే లేకుండా పోతే మరోవైపు నితిన్ గడ్కరీ, గాలి జనార్థన్‌రెడ్డి వంటి బీజేపీ నేతలు తమ ఇంట అత్యంత ఘనంగా పెళ్లిళ్లు ఎలా జరిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తన కూతురి గురించి చెబుతూ.. త్వరలోనే ఆమె తెరంగేట్రం చేయబోతున్నారని జీవితారాజశేఖర్ తెలిపారు.












Click it and Unblock the Notifications