శ్రీనివాస్ కూచిభొట్ల భార్యకు వీసా తిప్పలు తప్పవా?

కాన్సాస్ కాల్పుల్లో మరణించిన తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయనకు వీసా తిప్పలు తప్పేట్లు లేవని అనిపిస్తోంది.

హైదరాబాద్: అమెరికా కంపెనీ గార్మిన్ సహాయం చేయడానికి సిద్ధపడినట్లు మృతుడు శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయనకు వీసా కష్టాలు తప్పేట్లు లేవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాను అమెరికాలోనే ఉంటానని, ప్రేమను పంచుతానని సునయన తన భర్త మరణించిన తర్వాత అన్నారు.

కాన్సాస్‌లోని బార్‌లో ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో తెలుగు ఇంజనీరు శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియల కోసం సునయన హైదరాబాద్ వచ్చారు. ఆమెకు హెచ్4 డిపెండెంట్ వీసా మాత్రమే ఉంది. కూచిభొట్ల మాత్రం హెచ్1బి వీసా మీద ఉంటూ వచ్చారు.

Kansas shooting: Hyderabad techie Srinivas's wife faces US visa problem

సునయన అమెరికాకు తిరిగి రావడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు, గార్మిన్ కంపెనీ న్యాయపరమైన సమరం సాగించే యోచనలో ఉన్నాయి. శ్రీనివాస్ కూచిభొట్ల గార్మిన్ కంపెనీలు పనిచేసేవారు. సునయన తిరిగి అమెరికాకు రావడానికి మోహన్ నన్నపనేని నేతృత్వంలోని తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్‌మెంట్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను సంప్రదిస్తోంది.

దాని కోసం అమెరికా ఇమ్మిగ్రేషన్, ప్రభుత్వాలకు ఆ సంఘం విజ్ఞప్తి చేయడానికి సిద్ధపడింది. శ్రీనివాస్ కూచిభొట్ల గ్రీన్ కార్డు దరఖాస్తు ఇంకా ప్రాసెస్‌లో ఉన్నట్లు తెలుసతోంది. సునయన వీసాను బీ2 కిందికి మార్చే ప్రక్రియను అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ధ్రువీకరించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+