నందమూరి వారి పెళ్లి: చేతులు కలిపిన చంద్రులు, నవ్వులు(పిక్చర్స్)
నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్: నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఒకే చోట కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. వారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండటంతో అక్కడివారు ఆసక్తిగా తిలకించారు.

చేతులు కలిపిన చంద్రులు
ఈ వేడుకకు ఇద్దరు సీఎంలతోపాటు ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ దంపతులు, చిరంజీవి, జమున, కేంద్రమంత్రులు వెంకయ్యనాయిడు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ దంపతులు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

కేసీఆర్, చంద్రబాబు
హైటెక్స్‌లోని నోవాటెల్‌లో శుక్రవారం నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

తెలుగు రాష్ట్రాల సీఎంల నవ్వులు
ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ నివాసంలో శుక్రవారం జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్.

కేసీఆర్‌తో హరికృష్ణ, మంత్రి తుమ్మల
ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ నివాసంలో శుక్రవారం జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్. చిత్రంలో నందమూరి హరికృష్ణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులున్నారు.

విద్యార్థి నేత వివాహ వేడుకలో..
విద్యార్థి జేఏసీ నేత వివాహ వేడుకకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.

నూతన వధూవరులకు ఆశీర్వాదం
కె వెంకటరావు మనుమడి వివాహ వేడుకకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతోపాటు పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications