ఫలక్‌నుమాలో విందు: బగ్గీలో కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు శుక్రవారం రాత్రి హైదరాబాదులోని చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇచ్చారు. వైవీ రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులతో శుక్రవార మధ్యాహ్నం కెసిఆర్, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కెసిఆర్ ఆర్థిక సంఘం సభ్యులకు ఇచ్చిన విందులో గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు విచ్చేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ ఈ విందులో పాల్గొన్నారు.

ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితో పాటు సభ్యులు అభిజిత్ సేన్, ఎం. గోవిందరావు, సుష్మానాథ్, సుదీప్ మోండే, ఎంఎం ఝాలు ఈ విందుకు హాజర్యయారు. ఈ విందులో హైదరాబాద్ బిర్యానీతో పాటు పలు తెలంగాణ వంటకాలను వడ్డించారు.

విందులో ఇలా...

విందులో ఇలా...

వైవీ రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇచ్చారు.

విందులో గవర్నర్, సిఎం ఇలా..

విందులో గవర్నర్, సిఎం ఇలా..

హైదరాబాదులోని చారిత్రికమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కెసిఆర్ ఇచ్చిన విందుకు గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో...

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో...

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌తో ఇలా..

గుర్రపు బగ్గీలో ఇలా...

గుర్రపు బగ్గీలో ఇలా...

తెలంగాణ మఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులతో ఇలా గుర్రపు బగ్గీలో స్వారీ చేశారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇలా...

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇలా...

పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇలా కనిపించారు.

కెసిఆర్ ఇలా..

కెసిఆర్ ఇలా..

పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు విందు ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వచ్చినప్పుడు..

వైవీ రెడ్డికి సన్మానం...

వైవీ రెడ్డికి సన్మానం...

పద్నాలుగో ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖఱ రావు శాలువా కప్పి ఇలా సత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+