దసరా: కెసిఆర్ ఆయుధ పూజ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ పండుగల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెలంగాణ సంప్రదాయాన్ని, ప్రత్యేకతను, విశిష్టతను చాటి చెప్పే బతుకమ్మ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో ఆయన నిర్వహించారు.
దసరా సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
గుమ్మడి పండును పగులగొట్టి కారుకు పూజలు చేశారు. ఆయన దైవభక్తిని ఇతోధికంగా చాటుకుంటున్నారు. బంగారు తెలంగాణను సాధిస్తానని చెబుతున్న ఆయన తెలంగాణ ప్రత్యేక ఆకర్షణలపై కూడా దృష్టి పెట్టారు.

కెసిఆర్ ఆయుధ పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దసరా పర్వదినం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయుధ పూజ చేశారు.

కెసిఆర్ ఆయుధ పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దసరా పర్వదినం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయుధ పూజ చేశారు.

కెసిఆర్ ఆయుధ పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వాహనం ముందు గుమ్మడి పండును పగులగొడుతూ ఇలా కనిపించారు.

కెసిఆర్ ఆయుధ పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన వాహనానికి కూడా పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఇలా..

కెసిఆర్ ఆయుధ పూజ
ఆయుధ పూజలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సతీమణి శోభతో కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications