భవిష్యత్తుపై దృష్టి: వ్యూహాత్మకంగా కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా వ్యవవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎంపిక చేసుకుని ఆయన కొందరు నేతలపై నోటి దురుసుతనం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెసు అగ్రనేతలు సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై ఆయన నేరుగా విమర్శలు చేయడం లేదని అంటున్నారుట.

సోనియాగాంధీ తెరాస తీరును తప్పుబట్టినా, కెసిఆర్‌ను ఉద్దేశించి రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసినా వాటిపై తీవ్రంగా స్పందించకుండా వాటికి సమాధానం ఇచ్చే రీతిలో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూ ఆ పార్టీ అగ్ర నాయకులు చేసిన విమర్శలపై కెసిఆర్ ఘాటుగా స్పందించడంలేదని అంటున్నారు.

KCR strategical approach in election compaign

పొన్నాల లక్ష్మయ్య వంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులపై ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వారిగా సోనియా, రాహుల్‌ను ప్రజలు పట్టించుకుంటున్నారని, వారిపై నేరుగా మాటల దాడికి దిగితే మొదటికే మోసం వస్తుందని ఆయన భావిస్తుండవచ్చని చెబుతున్నారు. అయితే బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీని సన్నాసి అంటూ విమర్శించారు. బిజెపికి, టిడిపి అండగా నిలుస్తున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నూ కెసిఆర్ వదిలిపెట్టకపోవటాన్ని గుర్తుచేస్తున్నారు. మోడీ గాలివాటం ఉందని భావిస్తున్న తరుణంలో బిజెపికి ఓట్లు రాలకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎప్పటిమాదిరిగానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న కెసిఆర్, ఆ పార్టీ ఎత్తుకున్న బిసి నినాదం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్.కృష్ణయ్య జోలికి కెసిఆర్ వెళ్డడం లేదు. అలాగే బిజెపి తెలంగాణ నేతలను, వైయస్సార్ కాంగ్రెసు అధినేత జగన్‌ను, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలను కూడా ఆయన విమర్శించడం లేదు. భవిష్యత్తులో ఏ పార్టీ అవసరం ఏ రకంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా కొందరిపైనే గురిపెడుతున్నారని చెబుతున్నారు.

తెరాసతో సీట్ల సర్దుబాటుకు మజ్లీస్ ముందుకు రాకపోయినా ఆ పార్టీతో వైరానికి కెసిఆర్ సుముఖంగా లేరని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా తెరాస, ఎంఐఎం సహకరించుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద, కెసిఆర్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+