కిరణ్ డ్రామానా?: హావభావాలు ఇలా (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పార్టీ అధిష్టానంపై దండెత్తడాన్ని ప్రతిపక్షాలు నాటకంగా అభివర్ణిస్తున్నాయి. కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు కాంగ్రెసు అధిష్టానం ఆడిస్తున్న డ్రామా అని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి శనివారంనాడు అన్నారు.

పార్టీ అధిష్టానం సూచనల మేరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ విమర్శించారు. అయితే, ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంపై ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

సోనియా గాంధీ కారణంగానే తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, తాను కాంగ్రెసును వదిలిపెట్టనని అంటూనే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా పట్టారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. మీడియా సమావేశంలో ఆయన హావభావాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి.

విభజన తప్పు..

విభజన తప్పు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం తప్పు... తప్పు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమొక్కటే మార్గమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిగిరావాల్సిందే..

దిగిరావాల్సిందే..

రాష్ట్ర విభజన నిర్ణయంపై కేంద్రం దిగి రావాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. విభజన సమస్యకు పరిష్కారాలు లేవని, జరిగింది పార్టీ నిర్ణయమే గానీ ప్రభుత్వ నిర్ణయం కాదని కిరణ్ రెడ్డి అన్నారు.

నెహ్రూ, ఇందిర చేసిందేమిటి...

నెహ్రూ, ఇందిర చేసిందేమిటి...

సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఆయన మాట్లాడారు. సిడబ్ల్యుసి నిర్ణయమే శిలాశాసనమైతే నెహ్రూ, ఇందిరా గాంధీ చేసింది పొరపాటా అని ఆయన అడిగారు.

సీటు వదులుకోవడానికి సిద్ధం..

సీటు వదులుకోవడానికి సిద్ధం..

తాను సీటును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పదవి కాదు, తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చెప్పారు.

తీవ్ర ఆగ్రహం...

తీవ్ర ఆగ్రహం...

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి తీవ్రమైన ఆవేదనను, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వెల్లడించారు. దిగ్విజయ్ సింగ్ శాశ్వతం కాదని అన్నారు.

సీరియస్ విషయాలు చెప్తా..

సీరియస్ విషయాలు చెప్తా..

తాను కీలకమైన విషయాలు చెబుతానని, మధ్యలో డిస్టర్బ్ చేయవద్దని ఆయన మీడియా సమావేశానికి ముందు అన్నారు. తద్వారా కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

మ్యాప్ చూపిస్తూ...

మ్యాప్ చూపిస్తూ...

ఈ రాష్ట్రం విడదీయలేనిదని, విడదీస్తే వచ్చే సమస్యలను ఎవరూ పరిష్కరించలేరని స్పష్టంచేశారు. రాష్ట్రం విడిపోతే జల యుద్ధాలు తప్పవని మ్యాప్ చూపించి మరీ వివరించారు.

దిగ్విజయ్‌పై నిప్పులు

దిగ్విజయ్‌పై నిప్పులు

సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి అంటూ తనకు పదేపదే గుర్తుచేస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి చురకలు వేస్తూ... ఆయన ఆ మాట అన్నప్పుడల్లా తనకు సమైక్య రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలా అన్న పట్టుదల ద్విగుణీకృతం అవుతున్నదని పేర్కొన్నారు.

నేను చంద్రబాబును కాను

నేను చంద్రబాబును కాను

"నేను పదవికోసం గడ్డి తినేరకం కాదు. నేను చంద్రబాబును కాదు. వైసీపీ, టీడీపీ చేస్తున్నది పదవి కోసమే. తేడా గమనించండి. చంద్రబాబు 60 రోజులు తిరిగి... ఏం చెప్పారో అర్థం కావడంలేదు. ప్రజలకు మేలు చేసేందుకే నేను మాట్లాడుతున్నా" అని ముఖ్యమంత్రి అన్నారు.

నీళ్లూ, ఉద్యోగాలు..

నీళ్లూ, ఉద్యోగాలు..

రాష్ట్ర విభజన వల్ల నదీజలాల విషయంలో, ఉద్యోగాల విషయంలో తలెత్తే సమస్యలను ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వివవరించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+