వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కిరణ్ రెడ్డి వద్ద రహస్య అస్త్రం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Reddy has a ‘weapon’ to stall Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తన వద్ద రహస్యమైన అస్త్రం ఉందని, దాన్ని ప్రయోగిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఆ రహస్య ఆయుధం ఏమిటనే విషయంపై చర్చ జరుగుతోంది. శాసనసభలో తన ప్రసంగం ముగించిన తర్వాత దాన్ని ప్రయోగిస్తానని చెప్పిన ఆయన ఆ ఆయుధం ఏమిటనేది చెప్పలేదని అంటున్నారు.

గురువారంనాడు శాసనసభకు వచ్చిన వెంటనే తన ఛేంబర్‌కు రావాలని సీమాంధ్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంతకుమార్, డొక్కా మాణిక్యవరప్రసాద్, పసుపులేటి బాలరాజు, సాకే శైలజానాథ్, శత్రుచర్ల విజయరామారాజు, కన్నా లక్ష్మినారాయణ, పార్థసారథి, పితాని సత్యనారాయణ తదితరులు హుటాహుటిన ముఖ్యమంత్రి ఛేంబర్‌కు చేరుకున్నారు.

రాజీనామా చేయడానికి సిద్ధపడి తమను పిలిచారేమోనని భావించిన సీమాంధ్ర మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వద్ద రహస్య అస్త్రం ఉందని, ప్రయోగిస్తానని చెప్పారు. తాను శాసనసభలో చేయబోయే ప్రసంగం గురించి ఆయన వారితో చర్చించారు. సమావేశం మధ్యలో ఉండగానే ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి మరో వారం గడువు పొడిగించినట్లు సమాచారం అందింది.

తాను శాసనసభలో సమైక్యాంధ్ర కోసం తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని, వోటింగ్‌కు డిమాండ్ చేస్తానని ముఖ్యమంత్రి సీమాంధ్ర మంత్రులతో చెప్పారు. ఈలోగా ఓ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగ పాఠాన్ని చదివి, చాలా బాగుందని చెప్పారట.

తమతో ఏదీ మాట్లాడని ముఖ్యమంత్రి ఈసారి ప్రత్యేకంగా తమను పిలిచి ఆ విషయం చెప్పడంలోని ఆంతర్యమేమిటని సీమాంధ్ర మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారని జాతీయ మీడియా చానెళ్లలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారమంతా నడిచింది. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రయోగించబోయే అస్త్రం రాజీనామానా, శాసనసభ రద్దకు సిఫార్సా అనేది తేలడం లేదు.

English summary

 Chief Minister N. Kiran Kumar Reddy informed Seemandhra ministers that he had a surprise up his sleeve to stall bifurcation of the state which he will use at the end of his speech on the Telangana Bill in the Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X