కిరణ్ రెడ్డి పార్టీ: జగన్‌కు నష్టం, బాబు ఊరట

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టాలనే నిర్ణయం సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమైక్య గళంతో కాంగ్రెసు అధిష్టానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ రెడ్డి చివరికి పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదిగా పేరు పడడంతో ఆయన వైయస్ జగన్‌ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమైక్యవాదానికి చాంపియన్ కావాలని జగన్, కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచీ పోటీ పడుతూ వస్తున్నారు. జగన్ కాంగ్రెసు అధిష్టానానికి సహకరించారనే అపవాదు వల్ల కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా చీలి జగన్‌కు నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

కాంగ్రెసుకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి నష్టం కలిగించే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. కాంగ్రెసుకు చెందిన నాయకులే ఎక్కువ మంది కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి అండగా నిలుసున్నారు కాబట్టి ఆ మేరకు కాంగ్రెసుకు నష్టం జరగవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెసులో ఉండలేక, వైయస్సార్ కాంగ్రెసులో చేరలేక సతమతవుతున్న నాయకులకు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఆలంబన అవుతుందని భావిస్తున్నారు.

Kiran Reddy party may help TDP

కిరణ్‌ కుమార్‌రెడ్డి పార్టీలో పార్లెమంటు సభ్యులు హర్షకుమార్‌, సాయి ప్రతాప్‌, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రాయపాటి సాంబశివరావు వంటి వారు చేరి బరిలోకి దిగే అవకాశం ఉన్నందున కాంగ్రెసు నష్టపోతుందని అంటున్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి కొత్త పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 35 నుంచి 40 దకా అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగ, యువత, విద్యార్థి లోకం నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఓట్లు అన్నీ సమైక్యరాష్ట్రం కోసం పోరాడిన నేపథ్యం ఉన్న కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త పార్టీకి పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.

సమైక్యకోసం పోరాడిన ఉద్యోగ సంఘాల నేతలను కూడా తన పార్టీ తరపున బరిలోకి దించాలని కిరణ్‌ కుమార్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ తన ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటే బహుముఖ పోటీలో విజయం సాధించవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం చంద్రబాబుకు కలిసి వస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్లితే మాత్రం చంద్రబాబుకు కష్టమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+