రావు బాలసరస్వతిపై లతా మంగేష్కర్‌కు అసూయ?

అనంతపురం: తన మధురమైన గానంతో తెలుగు సినీ అభిమానులను ఉర్రూతలూగించిన రావు బాలసరస్వతి దేవికి హిందీ సినీ గాయని లతా మంగేష్కర్‌ నష్టం కలిగిచారా అనేది చాలా కాలంగా చర్చనీయాంశంగానే ఉంది. హిందీలోకి వెళ్లకుండా తనను లతా మంగేష్కర్ అడ్డుకున్నారని రావు బాలసరస్వతి ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. తాజాగా, అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అదే విషయం చెప్పారు. లతా మంగేష్కర్‌కు తనపై ఉన్న వృత్తిపరమైన అసూయ కారణంగానే తాను హిందీ సినిమాల్లో అడుగు పెట్టలేకపోయానని రావు బాలసరస్వతీ దేవి ఆరోపించారు.

లతా మంగేష్కర్‌కు తనపై ఉన్న అసూయ కారణంగానే ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్ హిందీ సినిమాకు తనను దూరం పెట్టారని ఆమె అన్నారు. రావు బాలసరస్వతి వివిధ భాషల్లో 2 వేలకు పైగా పాటలు పాడారు. ఆదివారంనాడు మొహమ్మద రఫీ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో భాగంగా రావు బాలసరస్వతిని అనంతకళావాహిని సత్కరించింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

తొలినాళ్లలో తెలుగు సినీరంగంలో వృత్తిపరమైన అసూయకు తావుండేది కాదని ఆమె అన్నారు. సాలూరి రాజేశ్వర రావు, రమేష్ నాయుడు, ఘంటసాల వంటి పలువురు ప్రముఖ సంగీత దర్శకులు దాన్ని దరి చేరనీయలేదని ఆమె అన్నారు. తామంతా ఒక కుటుంబం మాదిరిగా ఉండేవాళ్లమని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Lata Mangeshkar’s envy affected my career: Bala Saraswati Rao

ఈ కాలపు సంగీతంపై అసంతృప్తి

ఈ తరం సంగీతంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నేటి తరం సంగీతంలో స్వచ్ఛత కరువైందని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి తరం సంగీతంలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ద్వంద్వార్థాలు కలిగిన పాటలతో స్వచ్ఛమైన సంగీతం మలినం అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహనలోపంతో నేటి తరం గేయ రచయితలు, సంగీత దర్శకులు అర్థం లేని పాటలతో సాహిత్యాన్ని పెడదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 1934లో మొదటిసారిగా తాను ఆరేళ్ల వయస్సులో సినిమాలో పాట పాడానని, తన సంగీత ప్రయాణంలో సాలూరి రాజేశ్వరరావు, నాగయ్య, ఘంటసాల, రమేష్ నాయుడు వంటి గొప్ప సంగీత దర్శకులు, గాయకులతో కలిసి పాటలు పడే అదృష్టం దక్కిందని అన్నారు.

స్వచ్ఛమైన సంగీతాన్ని అవమానపరిచే పాటలను మనసును చంపుకుని పాడలేక పాటలకు దూరంగా ఉన్నట్లు రావు బాలసరస్వతి చెప్పారు. తెలుగు భాష తెలియని వారితో పాటలను పాడిస్తూ భాషను ఆభాసు పాలు చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు. తెలుగువారిలో ఎంతో మంది మంచి సంగీతదర్శకులు, గాయకులు ఉన్ారని, సరైన గుర్తింపు లేక వారు రాణించలేకపోతున్నారని ఆమె అన్నారు. అటువంటివారికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+