Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అచ్చం తండ్రి లాగే: రాహుల్ ద్రావిడ్ తనయుడి ధాటి

బెంగళూరు: ఇంత వరకు భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వార్తల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ తన సత్తా చాటుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు.

రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ వయసు పది దాటకపోయినా పాఠశాల క్రికెట్‌లో దంచేస్తున్నాడు. అండర్-12 టోర్నమెంట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవలి మ్యాచ్‌లో సూపర్ ఫిఫ్టీ (77)తో తన జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌ను గెలిపించిన 9 ఏండ్ల సమిత్ తాజాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులతో సెంచరీకి దూరమయ్యాడు.

Like Father Like Son: Rahul Dravid's son Samit shines again

సమిత్ చేసిన 93 పరుగులతో మాల్యా జట్టు 16 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 168 పరుగుల స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ 6 వికెట్లు నష్టపోయి 107 పరుగులకే కుప్పకూలింది. సమిత్ దూకుడు ఇలాగే సాగితే మరో పదేండ్లలో టీమ్ ఇండియాలో మరో ద్రవిడ్‌ను చూడడం ఖాయమని అంటున్నారు.

భారత్ ఎ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్‌కు ఇద్దరు కుమారులున్నారు. సమిత్ పెద్ద కుమారుడు కాగా, చిన్న కుమారుడి పేరు అన్వయ్. వీరిద్దరు కూడా ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) మ్యాచుల సందర్భంగా బయటి ప్రపంచానికి కనిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+