Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసమర్థుడిగా మిగిలిపోతానన్న భయమా! : లోకేశ్ అలా ఎందుకు అన్నారు?

హైదరాబాద్ : 'మంత్రిపదవి చేపట్టకపోతే నన్నో అసమర్థుడు అనుకుంటారు'.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అయితే ఇది తన అభిప్రాయం కాదని, పార్టీ నేతల అభిప్రాయమని లోకేశ్ చెబుతున్పనప్పటికీ.. అధినేత కుమారుడిగా పార్టీలో నంబర్.2 గా ఎదగాలని భావిస్తున్న లోకేశ్.. పరోక్షంగా మంత్రిపదవిపై తాను పెట్టుకున్న ఆశలను ఇలా వ్యక్తం చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో.. లోకేశ్ కేబినెట్ బెర్త్ పై ఇంతవరకు స్పష్టమైన సంకేతాలేవి లేవు. ఇంతలోనే మంత్రి పదవి కోసం లోకేశ్ గట్టిగా పట్టుబడుతున్నారని, ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, దీంతో బ్రాహ్మణి సైతం రంగంలోకి దిగి లోకేశ్ కు మంత్రిపదవి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

Lokesh comments leads to interesting discussion over his ministry

అయితే అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసిన లోకేశ్.. ఇప్పటికిప్పుడు మంత్రిని కావాలన్న కోరిక తనకు లేదని మీడియా ముఖంగా పలుమార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య గత వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉండడంతో.. మంత్రిపదవి విషయంలో చంద్రబాబుపై లోకేశ్ కు ఉన్న అసంత్రుప్తితోనే ఈ వ్యాఖ్య చేశారా..! లేక నిజంగా పార్టీ నేతలు చెప్పిన మేరకు ఇప్పుడు రంగంలోకి దిగకపోతే తననో అసమర్థుడిగా జనం భావిస్తారని! ఈ వ్యాఖ్య చేశారా అన్నది ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతోన్న ప్రశ్న.

ఓవైపు కేటీఆర్ దూసుకుపోతుంటే.. మరోవైపు లోకేశ్ మాత్రం!

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఈపాటికే తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాటుదేలాడు. ప్రభుత్వంలోను జనంలోను సమర్థుడన్న పేరును సంపాదించుకున్నాడు. దీంతో కేసీఆర్ భవిష్యత్తు రాజకీయాలను కేటీఆర్ సమర్థవంతంగా కొనసాగిస్తారన్న నమ్మకం అటు కేసీఆర్ లోను, టీఆర్ఎస్ లోను బలంగా నాటుకుపోయింది.

ఇక లోకేశ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. పార్టీ నేతగా ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు చెక్ పెట్టాలంటే ఆయన మంత్రివర్గంలోకి రావాలి. అదెప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. దీంతో తానో సమర్థుడినని నిరూపించుకోవాలన్న ఆతృతనో.. లేక పరిస్థితి ఇలాగే కొనసాగితే తానో అసమర్థుడిగా మిగిలిపోతానన్న భయమో లోకేశ్ లో ఎక్కువైనట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తాజా వ్యాఖ్యలను చూడాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

చూడాలి మరి.. లోకేశ్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కేబినెట్ బెర్త్ ఖాయమా కాదా అన్నది త్వరలో తేట తెల్లం కావచ్చేమో!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+