టిడిపికి 'డబుల్': గల్లా జయదేవ్‌కి మహేష్ ప్రచారం

టిడిపి నుండే పోటీ చేయనున్నప్పటికీ ఈ నెల 26వ తేదీ తర్వాత ఆ విషయం చెబుతానని ఆయన అంటున్నారు. గల్లా అరుణ కూడా తన తనయుడు ఏ నిర్ణయం తీసుకున్నా తాను స్వాగతిస్తానని ఆదివారం అన్నారు. తద్వారా జయదేవ్ టిడిపిలోకి వెళ్లినా తనకు అభ్యంతరం లేదని ఆమె పరోక్షంగా చెప్పారు. గల్లా జయదేవ్ గుంటూరు నుండి పోటీ చేస్తే ఆయన తరఫున అతని బావమరిది, స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ప్రచారం చేసే అవకాశాలున్నాయి.
గల్లా జయదేవ్ ప్రముఖ నటుడు కృష్ణ కూతురు, మహేష్ బాబు సోదరి పద్మావతిని వివాహం చేసుకున్నారు. జయదేవ్ గుంటూరు నుండి పోటీ చేస్తే మహేష్ బాబు ఆయన తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయంటున్నారు. మహేష్ టిడిపికి తరఫున ప్రచారం చేయకున్నప్పటికీ, కనీసం గుంటూరులోనైనా జయదేవ్ తరఫున ప్రచారం చేస్తే అది రాష్ట్రవ్యాప్తంగా టిడిపికి ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు.
మహేష్ బాబు నుండి తనకు పూర్తి మద్దతు ఉంటుందని, తన రాజకీయ లక్ష్యాలు నెరవేరాలని ఆయన కోరుకుంటారని జయదేవ్ చెబుతున్నారట. కృష్ణ స్వగ్రామం జయదేవ్ పోటీ చేస్తున్న గుంటూరు నియోజకవర్గంలో ఉంది. బావమరిది కోసమైనా మహేష్ బాబు ఈ ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని తెలుగు తమ్ముళ్లతో పాటు జయదేవ్ వర్గీయులు ఆశిస్తున్నారట. కాగా, ఇప్పటికే చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తాను రాజకీయాలకు దూరమని, టిడిపికి ప్రచారం మాత్రం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అసంతృప్తితో ఉన్నప్పటికీ తాత స్థాపించిన పార్టీకి అండగా ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications