'పవన్ కళ్యాణ్' పుస్తకాన్ని కొనుగోలు చేసిన మహేష్ కత్తి
హైదరాబాద్: నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించి మీడియాలో బాగా నానిన మహేష్ కత్తి హైదరాబాదులో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లో జనసేనానికి చెందిన ఓ పుస్తకాన్ని కొనుగోలు చేశారు.
హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఈ బుక్ ఫెయిర్‌లో మహేష్ కత్తి 'జనపవనమేనా' అనే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని కొనుగోలు చేశారు.

ఈ పుస్తకాన్ని సురేష్ వెలుగూరి రచించారు. ఈ పుస్తకం మహేష్ కత్తి చేతిలో కనిపించడం ఆసక్తిని రేపింది. ఈ పుస్తకంలో పవన్ జన రాజకీయ యనవనికపై తన ప్రభావాన్ని ఏ మేరకు చూపగలరు, పవన్ జీవితాన్ని ప్రజలు ఏఏ కోణాల నుంచి చూస్తున్నారు, పవన్ ప్రశ్నించేవాడిగా మిగులుతారా లేక జనసేనానిగా ఎదుగుతారా, 2019 పవన్‌కు ఏ మేర ఉపయోగపడుతుంది, ఆయన రాజకీయ అవగాహన.. తదితర అంశాలపై ఈ పుస్తకం ఉంది.












Click it and Unblock the Notifications