చరిత్ర తిరగరాసిన మమత, జయ: కరుణను దెబ్బతీసిన విజయకాంత్

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. తమిళనాడులో మరోసారి 'అమ్మ', బెంగాల్లో మళ్లీ 'దీదీ' అధికారంలోకి వస్తున్నారు.

ఈ గెలుపు ద్వారా జయ, మమతలు చరిత్ర సృష్టించారు. తమిళనాట అన్నాడీఎంకే, బెంగాల్లో తృణమల్ విజయబావుటా ఎగురవేస్తున్నాయి.

జయలలిత మరోసారి గెలిచి చరిత్ర సృష్టించారు. గత సంప్రదాయానికి భిన్నంగా తమిళనాడు ఓటర్లు తీర్పునిచ్చారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు అధికార పార్టీని మార్చుతుంటారు. ఓసారి డీఎంకేకు, మరోసారి అన్నాడీఎంకేకు అవకాశమిస్తారు. ఈసారి మళ్లీ జయకే తమిళ ప్రజలు పట్టం గట్టారు. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టి జయ చరిత్ర సృష్టించారు.

అమ్మ విజయానికి కొన్ని కారణాలు

Mamata Banerjee and Jayalalithaa records by winning second time

జయలలిత విజయానికి ముఖ్యంగా ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు తొలి కారణంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జయ ఉచ్చులో పడిన విజయకాంత్ (డీఎండీకే అధినేత) డీఎంకేకు దూరమయ్యాడు. డీఎంకే, డీఎండీకే పొత్తు పెట్టుకొని పోటీ చేయాలనుకున్నాయి. కానీ ఆఖరి నిమిషంలో విజయకాంత్ దూరం జరిగాడు.

దీంతో, ఇటు డీఎండీకే చతికిలపడింది. మరోవైపు డీఎంకే పార్టీ విజయాన్ని అందుకోలేకపోయింది. అమ్మ పేరుతో జయలలిత ప్రవేశ పెట్టిన పథకాలు జనాల్లోకి బాగా చొచ్చుకెళ్లాయని, ఆమె విజయానికి ఇవీ ముఖ్య కారణమని చెబుతున్నారు.

1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండో పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ఇన్నాళ్లుగా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి జయలలిత ఆ రికార్డును తుడిచి పెట్టారు.

బెంగాల్లో రెండోసారి దీదీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ దూసుకు పోయారు. 200కు పైగా సీట్లు గెలుచుకుంటున్నారు. బెంగాల్లో తన గెలుపు ద్వారా మమతా బెనర్జీ రికార్డులు సృష్టించారు.

వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన మహిళ అవుతారు. మమతా గెలుపు ద్వారా 1962 తర్వాత సింగిల్ పార్టీగా గెలిచిన ఏకైక పార్టీగా తృణమూల్ చరిత్ర సృష్టించింది.

1962లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 152 సీట్లు గెలిచింది. ఆమె చేతిలో లెఫ్ట్ పార్టీ వరుసగా నాలుగోసారి ఆమె చేతిలో చావు దెబ్బ తిన్నది. 2009 లోకసభ ఎన్నికల్లో, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోకసభ ఎన్నికల్లో లెఫ్ట్‌ను మమతా బెనర్జీ చావుదెబ్బ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి.

బెంగాల్లో లెఫ్ట్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. అదే సమయంలో ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకుందో (కాంగ్రెస్) ఆ పార్టీ బలపడేందుకు అవకాశమిచ్చింది. లెఫ్ట్ - కాంగ్రెస్ పొత్తు పెట్టుకోగా.. కాంగ్రెస్ కంటే లెఫ్ట్ తక్కువ సీట్లు గెలుచుకుంటోంది. ఇక, ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్దదైన అసోంలో గెలవడం ద్వారా బీజేపీ చరిత్ర సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+