కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి, హర్భజన్ సారీ: అరెస్టు
జలంధర్: టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహ వేడుక వద్ద గురువారం చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి, మోడల్ గీతా బస్రాతో హర్భజన్ పెళ్లి పంజాబ్లోని జలంధర్లో నిన్న అంగరంగవైభవంగా జరిగింది.
భజ్జీ పెళ్లి నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చాలామంది బౌన్సర్లను ఉంచారు. భద్రతను పర్యవేక్షిస్తున్న బౌన్సర్లు వివాహ వేడుకను వీడియో తీస్తున్న కెమెరామెన్ల పైన దాడి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కెమెరామెన్లు పెళ్లి వేడుక ముందే నిరసనకు దిగారు.

ఈ విషయం తెలిసిన హర్భజన్ సింగ్ వచ్చి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. దాడి చేసిన బౌన్సర్ల తరఫున హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పడంతో కెమెరామెన్లు కూడా శాంతించారు.
అయితే, ఆ తర్వాత దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కెమెరాలు దగ్ధం చేశారని చెబుతూ నలుగురు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బబ్బల్, గుర్ప్రీత్, నవజోత్, కుల్దీప్ అనే నలుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications