పదేళ్ల సాదిక్ ఏక్ దిన్ కా సిటీ కోత్వాల్ (పిక్చర్స్)
హైదరాబాద్: పదేళ్ల బాలుడు సాదిక్ చేతిలో లాఠీతో దర్జాగా నడుస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ కుర్చీలో కూర్చుని ఫైల్స్ చూస్తూ గడిపాడు. పెద్దయ్యాక ఐపీఎస్ అయ్యి రౌడీలు, గూండాల పని పట్టాలన్నది ఈ కుర్రాడి జీవిత లక్ష్యమని చెప్పాడు.గత ఐదు నెలలుగా బ్లడ్ కేన్సర్ ఈ బాలుడి జీవితాన్ని కొద్దికొద్దిగా కబళిస్తోంది.
ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారి చివరి కోరికలు తీర్చే ‘మేక్ ఏ విష్' సంస్థ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి సాధిక్ గురించి తెలిపింది. ఆయన పెద్దమనసు చేసుకుని అతడి కోరికను తీర్చారు. దాంతో నగర కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించి కమిషనర్ కుర్చీలో కూర్చున్నాడు. కమిషనర్ మహేందర్ రెడ్డి సహా పోలీసులంతా సాదిక్‌కు పోలీసు వందనం సమర్పించారు.
సాదిక్ బ్లడ్ కేన్సర్‌ను జయించి, ఐపీఎస్ కావాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. సాదిక్ మామ హెడ్ కానిస్టేబుల్ అని, మేనమామ ఆర్మీలో పనిచేస్తున్నాడని, మరో ఇద్దరు బంధువులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని, అందుకే సాదిక్ ఎప్పుడూ తాను పోలీస్ కమిషనర్ అవుతాననేవాడని అతడి తండ్రి రహీముద్దీన్ గద్గద స్వరంతో చెప్పారు. ఆయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

కోత్వాల్‌గా సాదిక్
సాదికే అనే పదేళ్ల బాలుడు ఖాకీ దుస్తులు ధరించి, ఓ రోజు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఇలా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

కోత్వాల్‌గా సాదిక్
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పదేళ్ల సాదిక్ కోరికను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి నెరవేర్చారు.

కోత్వాల్‌గా సాదిక్
పదేళ్ల సాదిక్ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బషీర్ బాగ్‌లోని కార్యాలయంలో కుర్చీపై దర్జాగా కూర్చుని విధులు నిర్వహిస్తుండడాన్ని ఇలా వీక్షించారు.

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ పోలీసు కమిషనర్ బాధ్యతలను పదేళ్ల సాదిక్‌కు అప్పగించి మహేందర్ రెడ్డి ఇలా గౌరవ వందనం చేశారు.

కోత్వాల్‌గా సాదిక్
పదేళ్ల హైదరాబాద్ కోత్వాల్ సాదిక్‌కు పుష్పగుచ్ఛం ఇస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఇలా..

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న పదేళ్ల బాలుడు సాదిక్ ఇలా కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పక్కన మహేందర్ రెడ్డిని చూడవచ్చు.

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బుధవారంనాడు పనిచేసిన సాదిక్ అధికారిక పత్రాలపై సంతకాలు కూడా చేశాడు.

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బుధవారం విధులు నిర్వహించిన పదేళ్ల బాలుడు సాదిక్ ఇలా దర్జాగా సీటుపై కూర్చున్నాడు...

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ పోలీసు కమిషనర్ బాధ్యతలను పదేళ్ల బాలుడు సాదిక్‌కు అప్పగించిన మహేందర్ రెడ్డి ఇలా కరచాలనం చేస్తూ...

కోత్వాల్‌గా సాదిక్
కోత్వాల్‌గా బాధ్యతలు చేపట్టిన పదేళ్ల బాలుడు సాదిక్ మీడియా సమావేశం కూడా నిర్వహించాడు. మీడియాతో ఇలా...

కోత్వాల్‌గా సాదిక్
హైదరాబాద్ కోత్వాల్‌గా మీడియా సమావేశం నిర్వహించిన సాదిక్ గుండాలు, రౌడీల పని పట్టడం తన లక్ష్యమని చెప్పాడు.












Click it and Unblock the Notifications