వణికిస్తోన్న 'మిస్టరీ సౌండ్స్': నాసాకే అంతుచిక్కని వైనం.. ఏంటీ వింత!..
Recommended Video

న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు కొన్ని వింత శబ్దాలు అంతుచిక్కని విధంగా మారాయి. గత కొన్నాళ్లుగా అంతరిక్షం నుంచి వెలువడుతున్న ఆ శబ్దాలు నాసా శాస్త్రవేత్తలతో పాటు ప్రజలను కూడా భయపెడుతున్నాయి.

64ప్రాంతాల్లో:
భూగోళం మీద ఇప్పటికే 64ప్రాంతాల్లో ఈ వింత శబ్దాలు రికార్డు అయినట్టుగా నాసా అధికారులు గుర్తించారు. అయితే ఆ శబ్దాలు ఏంటనేవి మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆస్ట్రేలియాలోని మిడిల్ ఈస్ట్ నుంచి ఈస్ట్ మిడ్ లాండ్స్ వరకు ఈ మిస్టరీ శబ్దాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఈ శబ్దాలకు బెంబేలెత్తిపోతున్నారు.

బామా బూమ్:
ఆస్ట్రేలియా, అమెరికాల్లో రికార్డయిన మిస్టరీ శబ్దాలను నాసా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. అమెరికా తూర్పు తీరంలో ఎక్కువమంది ఈ శబ్దాలను విన్నట్టు చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని అలబామా వాసులను కూడా ఈ వింత శబ్దాలు భయపెట్టాయి. శబ్దాలకు వణికిపోతున్న ప్రజలు.. వీటిని 'బామా బూమ్' అని పిలుస్తున్నారు.

ఏంటా సౌండ్స్?:
అలబామాలో అక్టోబర్ 10న ఓ పెద్ద శబ్దం వినిపించింది. అయితే స్థానికులంతా అది ఎఫ్‌ఏ-18 హార్నట్ విమానం నుంచి వెలువడిన శబ్దంగా భావించారు. రెండు వారాల తర్వాత దక్షిణ ఆస్ట్రేలియాలోని ఐర్ ద్వీపకల్పంలో అలాంటి శబ్దమే వినిపించింది.

నీలిరంగు ఉల్క:
ఐర్ ద్వీపకల్పంలో ఆ శబ్దం వినిపించిన సమయంలో ఆకాశంలో ఒక నీలిరంగు ఉల్క కనిపించింది. దీంతో సూపర్‌సోనిక్ విమానాల వల్ల ఆ శబ్దాలు వెలువడి ఉంటాయని చాలామంది భావించారు.
ఈ మిస్టరీ శబ్దాల గురించి అలబామా ప్రజలు ట్విట్టర్ లో తమ భయాన్ని వెలిబుచ్చారు. భూకంపం వచ్చిందా? అన్నట్టుగా ఆ శబ్దాలు సంభవించాయన్నారు. ప్రస్తుతం ఈ మిస్టరీ శబ్దాలను చేధించేందుకు నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications