Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోగినేని బాబు చేతిలో చిత్తు: జ్యోతిష్కుడు వేణు స్వామి ఆటకట్టు

హైదరాబాద్: ఓ జ్యోతిష్కుడి బండారాన్ని ఓ హేతువాది బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సిటీగా మారింది. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ చర్చలో జ్యోతిష్కుు వేణు స్వామికి, హేతువాది బాబు గోగినేనికి మధ్య చర్చ సాగింది.

ఆ చర్చలు చివరకు తాను చెప్పిందంతా జరగదని వేణు స్వామి చెప్పాల్సిన స్థితికి వచ్చారు. మహా న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చలో చివకు "నా పేరు వేణు స్వామి. నా అంచనాలు నిజం కావు. నేను చెప్పింది ఏదీ నిజం కాదు. నన్ను విశ్వసించవద్దు" అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చారు.

నరేంద్ర మోడీని కలిశానని..

నరేంద్ర మోడీని కలిశానని..

ఆస్ట్రో గురు వేణు స్వామి ప్రధాని నరేంద్ర మోడీని తాను కలిసినట్లు ఓ ఫొటో పెట్టుకున్నారు. అది మార్ఫింగ్ చేయించుకున్న ఫొటో అని బాబు గోగినేని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంతకు ముందు వేణు స్వామి పలు టీవీ చానెళ్లలో కనిపిస్తూ తాను చెప్పే జ్యోతిషంలో 90 శాతం వరకు నిజమవుతాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, బాబు గోగినేని ధాటికి తట్టుకోలేక తాను చెప్పేవి జరగవని అంగీకరించాల్సి వచ్చింది.

మార్ఫింగ్ చేసినట్లు ఇలా..

మార్ఫింగ్ చేసినట్లు ఇలా..

ప్రధాని మోడీని కలిసినట్లు వేణుస్వామి వెబ్‌సైట్‌లో పెట్టిన ఫొటో మార్ఫింగ్ చేసిందని గోగినేని బాబు నిరూపించారు. వేణు స్వామి అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని కలవలేదని కల్యాణ్ గుత్తికొండ అనే వ్యక్తి పెట్టుకున్న ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. దానికిప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం వచ్చంది. దాన్ని గోగినేని కూడా ఆయన ఆధారంగా చూపించారు. తాను మోడీని కలిసినట్లు పెట్టుకున్న ఫొటో వాస్తవం కాదని వేణు స్వామి అంగీకరించాల్సి వచ్చింది, అయితే అది తాను చేసింది కాదని ఓ వార్తా పత్రిక ప్రచురించిందని చెప్పారు. అయితే ప్రధాని మోడీని తాను కలిసిన మాట వాస్తవమేనని, ఎక్కడ ఎప్పుడు కలిశాననేది చెప్పాల్సిన అవసరం లేదని కూడా వేణు స్వామి వాదించారు.

వేణు స్వామి ఇలా చెప్పుకుంటారు...

వేణు స్వామి ఇలా చెప్పుకుంటారు...

ప్రముఖ జ్యోతిష్య పండితుడిగా వేణు స్వామికి గుర్గింపు దండిగానే ఉంది. తనకు పలువురు సినీ, రాజకీయ క్లయింట్లు ఉన్నారని చెబుకుంటారు. తాను దేవుడిని కాదని, వందకు వంద జరగవని, తాను చెప్పేవాటిలో 100లో కనీసం 90 కచ్చితంగా జరుగుతాని అంటారు. గతంలో పలు ఎన్నిక ఫలితాలను ముందే చెప్పగలిగానని, తమిళనాడు ధివంగత సీఎం జయలలిత మరణాన్ని తాను ముందే గణించానని కూడా చెప్పుకున్నారు. ఆయన వెబ్‌సైట్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు.

ఇలా చేదు అనుభవం

ఇలా చేదు అనుభవం

గురువారం రాత్రి ఓ న్యూస్ ఛానళ్లో జరిగిన చర్చా కార్యక్రమంలో వేణు స్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన చెప్పేవి ఏవీ నిజంకావంటూ హేతువాది గోగినేని బాబు ఆధారాలతో సహా నిరూపించారు. గతంలో వేణు స్వామి చెప్పినవి చాలా వరకు నిజం కాలేదని వాటిని వివరించారు. జ్యోతిష్యం పేరుతో సెలబ్రిటీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు.

ఇలా గోగినేని బాబు

ఇలా గోగినేని బాబు

వేణు స్వామి పాల్గొన్న న్యూస్ చానెల్ చర్చలోకి బాబు గోగినేని మధ్యలో ప్రవేశించారు. తాను లై డిటెక్టర్‌తో వచ్చానని, అది లైవ్ టెలివిజన్‌లో ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాలతో ఉన్న పుస్తకం అని గోగినేని బాబు చెబుతూ వేణు స్వామి చెప్పిన విషయాలు ఎలా తప్పో చెబుతూ వచ్చారు.

అది మతానికి వ్యతిరేకం కాదు...

అది మతానికి వ్యతిరేకం కాదు...

జ్యోతిష్యాన్ని వ్యతిరేకించడం మతానికి వ్యతిరేకం కాదని,, మోసానికి వ్యతిరేకం అని బాబు గోగినేని వేణు స్వామి చర్చను మతం పేరుతో పక్క దారి పట్టించాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో అన్నారు స్వామి వివేకానంద, దయానంద సరస్వతి సైతం జ్యోతిష్యాన్ని వ్యతిరేకించారని కూడా గుర్తు చేశారు. జ్యోతిష్యం పేరుతో పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తూ ,వ్యాపారం చేస్తున్నారని అన్నారు.

చివరకు వేణు స్వామి ఇలా..

చివరకు వేణు స్వామి ఇలా..

బాబు గోగినేని తనపై వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నారని, తనకుకు జ్యోతిష్యం రాదుని, ఆయన చెప్పిందే నమ్మండని, తాను చెప్పేవి నిజాలు కావని అంటూ చర్చ మధ్యలోనే వేణు స్వామి వెళ్లిపోయారు.

చివరకు గోగినేని ఇలా జోక్ చేశారు..

చివరకు గోగినేని ఇలా జోక్ చేశారు..

చివరకు గోగినేని బాబు హాస్యమాడుతూ వేణు స్వామిపై ఓ వ్యాఖ్య చేశారు. వేణు చెప్పిన వందలో ఒక్కటి మాత్రం నిజమైందని, అది ఫ్లోరిడాలోని హరికేన్ గురించి చెప్పిందని అన్నారు. ఇంతకు ముందు కూడా కొన్ని బండారాలను టీవీ చానెళ్లలో బాబు గోగినేని బయటపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+