గుండెకోత: ధోని తొలి ప్రేయసి ఇలా మృత్యువాత
హైదరాబాద్: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తీసిన ఎంఎస్ ధోనీ - అన్‌టోల్డ్ స్టోరీలో ఓ విషాదకరమైన సంఘటన ఉందని అంటున్నారు. సినిమాలో ధోనీ పాత్రను పోషించిన సుశాంత్ సింగ్ ఆ వివరాలను వెల్లడించాడు. ధోనీ తొలి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
ఆ ప్రస్తావన సినిమాలో ఉందని చెబుతున్నారు. వివాహానికి ముందు ధోనీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సంఘటనలు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలో ఆ చర్చ ముందుకు వచ్చింది. వివాహానికి ముందు ధోనీ ప్రేమ వ్యవహారం సినిమాలో ఉంటుందని అంటున్నారు.

ధోనీ ప్రేమ కథనకు సంబంధించిన దృశ్యాల్లో నటించినప్పుడు తన గుండె భారమైపోయిందని సుశాంత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ధోనీ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి ప్రేమ కథ అది. ధోనీ తొలి ప్రేయసి పేరు ప్రియాంక ఝా.
ఓ వైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న రోజుల్లో ధోనీకి ఆమెతో పరిచయం ఏర్పడిందట. ధోనీ క్రికెట్ క్రీడలో ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కుతున్న సమయంలో ప్రియాంక 2002లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
ప్రియాంక పాత్రలో దిశ నటించినట్లు తెలుస్తోంది. 2003 - 2004లో ఇండియా ఎ జట్టులో స్థానం పొందిన ధోనీ కెన్యా, జింబాబ్వే పర్యటనలు చేశాడు. క్రికెట్ క్రీడలో తన సత్తా చాటుతున్న సమయంలోనే ధోనీ ప్రియాంకను కోల్పోయాడు. దీని నుంచి బయటపడడానికి ధోనీకి ఏడాది పట్టిందట.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications