కోపమొచ్చాకే పవన్‌కళ్యాణ్: చిరు ఇలా,నాగబాబు అలా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మెగా' కుటుంబ సభ్యుల సినిమా కార్యక్రమాలకు రాకపోవడంపై ఎప్పుడు చర్చ జరుగుతుంటోంది. రెండు రోజుల క్రితం చిరంజీవి 60వ జన్మదినం వేడుకల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు.
దీంతో, అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చిర్రెత్తుకొచ్చిన నాగబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చిరంజీవి పలు ఇంటర్వ్యూలలో కుటుంబంపరంగా తాము ఒకటి అని, రాజకీయంగా రెండు అని చెప్పారు.
తమ మధ్య విభేదాలు ఉన్నాయని అభిమానులు భావిస్తారని, కానీ కుటుంబపరంగా తాము ఒకటేనని చెప్పారు. అయితే, రాజకీయ కార్యక్రమాలను పక్కన పెడితే... పవన్ కళ్యాణ్ పలు మెగా సినిమా వేడుకలకు రాకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

అదే సమయంలో ఇంటర్వ్యూలలో చిరంజీవి.. తాము కుటుంబపరంగా ఒకటేనని చెప్పారని, కానీ పవన్ కళ్యాణ్ కోసం నినదించిన వారిని ఉద్దేశించి మెగాస్టార్ 60వ జన్మదిన వేడుక కార్యక్రమంలో నాగబాబు ఘాటుగా స్పందించారని గుర్తు చేస్తున్నారు.
కాగా, ఇన్నాళ్లు మెగా కుటుంబ సినిమా వేడుకలకు బహిరంగంగా దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ శనివారం మాత్రం 'అన్నయ్య' చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. నాగబాబు ఆగ్రహం తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications