టి, సీమాంధ్రపై ప్లాన్: ప్రధాన కార్యదర్శిగా లోకేష్

Nara Lokesh may get key post in Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేస్తారని, మల్కాజిగిరి నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటున్నారు. 2019 లక్ష్యంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. నారా లోకేష్‌తో పాటు టిడిపి సీనియర్ల తనయులు, యువ నేతలు పోటీ చేస్తారని చాలామంది భావించారు.

ప్రస్తుతానికి అందరం పోటీకి దూరంగా ఉండి... 2019 లక్ష్యంగా పని చేద్దామని లోకేష్ వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీని తట్టుకొని క్రమంగా పార్టీలోకి రావడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్... తదుపరి ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారట. త్వరలో ఆయనకు టిడిపిలో ప్రధాన కార్యదర్శి పదవి వరించనుందని తెలుస్తోంది.

గతంలో చంద్రబాబు కార్యదర్శిగా ఉండి పార్టీ పైన పట్టు సాధించారు. ఇప్పుడు నారా లోకేష్‌ను ప్రధాన కార్యదర్శి పదవి వరించే అవకాశముందంటున్నారు. ఆ పదవి ద్వారా లోకేష్ పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నించనున్నారు. నారా లోకేష్ ఇంట గెలిచి... అంటే టిడిపిలో పట్టు సాధించి ఆ తర్వాత రచ్చ గెలువాలని భావిస్తున్నారట. 2019లో పోటీ చేసేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తున్నారట.

లోకేష్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేయనున్నప్పటికీ... తెలంగాణ పైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో యువతతో కలిసి పార్టీని పటిష్ట పర్చనున్నారు. 2019లో తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి లోకేష్ తన ప్రణాళికతో తన వంతు సహకారం అందించే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఇటీవల మహానాడులో నారా లోకేష్ ప్రసంగం ఆకట్టుకుంది. ఆయన మహానాడులో వేదిక కింద కూర్చున్నారు. మాట్లాడాలని కోరినప్పుడు వేదిక పైకి వచ్చి నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టేలా ప్రసంగం చేశారు. అందరితో కలివిడిగా మాట్లాడారు. నాయకులను, యువతను పలకరించారు. ఇదంతా లోకేష్ వ్యూహాత్మకమే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+