టిడిపిలోకి నారా రోహిత్: ఎన్టీఆర్ ప్లేస్ భర్తీ (ఫొటోలు)
హైదరాబాద్: నారా వారి కుటుంబం నుంచి మరో యువ నేత రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో నారా రోహిత్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారనే వదంతులు సాగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని నారా రోహిత్ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ గ్లామర్‌ను వచ్చే ఎన్నికల్లో వాడుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌తో పాటు నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలుపై దృష్టి సారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కుండువా వేసుకుని నారా రోషిర్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను నారా రోహిత్ ఆవిష్కరించారున.
సంక్రాంతి పర్వదినం రోజు తమ స్వగ్రామం నారావారి పల్లెలో నిర్వహించిన ఆత్మీయ విందుకు హాజరై, పార్టీ నేతలతో నారా రోహిత్ చాలా సేపు ముచ్చటించారు. అంతేకాకుండా, గుంటూరు జిల్లాలోని నారా కోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించి, ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో అక్కడి కీలక నేత ఇంటికి భోజనానికి వెళ్లి రెండు గంటల పాటు తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడారు. పెనమలూరు శానససభ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తారనే అభిప్రాయం ఉంది.
రాజకీయాలకు దూరంగా ఉండే నారా రోహిత్ ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు అవుతుండడం, తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతుండడం చూస్తే ఆయన రాజకీయ రంగప్రవేశం ఖాయమని అంటున్నారు.

రాజకీయాల్లోకి నారా రోహిత్ 1
నారావారిపల్లెలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా హీరో నారా రోహిత్ ఆత్మీయ సమావేశంలో ఇలా కనిపించారు.

రాజకీయాల్లోకి నారా రోహిత్ 2
నారా రోహిత్ తెలుగుదేశం కండువాను కప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ఈ యువ హీరో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

రాజకీయాల్లోకి నారా రోహిత్ 3
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తూ తెలుగు సినిమా హీరో నారా రోహిత్. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌కు ఆయన అండగా నిలిచే అవకాశం ఉంది.

రాజకీయాల్లోకి నారా రోహిత్ 4
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన తర్వాత తెలుగు సినిమా హీరో నారా రోహిత్ ఇలా కనిపించారు. ఆయన ప్రజలతో కలిసిపోతున్నారు.












Click it and Unblock the Notifications