గవర్నర్ల ఇష్యూ: రోశయ్య, నరసింహన్‌లకు ఊరట

నరసింహన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకపోవడం వల్ల, ప్రతిష్ట వల్ల నరసింహన్‌ను మోడీ ప్రభుత్వం ప్రస్తుతానికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ఇంతకు ముందు నరసింహన్ ఛత్తీస్‌గడ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ సమయంలో గవర్నర్‌కు, అక్కడి ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు మధ్య ఏ విధమైన తేడాలు రాలేదు.
యుపిఎ ప్రభుత్వం నియమించినప్పటికీ నరసింహన్ బిజెపి ప్రభుత్వంతో సామరస్యపూర్వకమైన సంబంధాలను కొనసాగించారు. నరసింహన్ చురుకైన పాత్ర కూడా పోషించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నరసింహన్ కఠినంగా వ్యవహరించినప్పటికి యుపిఎ రాష్ట్ర విభజనను చేపట్టిన సమయంలో అందుకు అనుగుణంగా తనను మలుచుకున్నారు.
తమిళనాడు గవర్నర్ కె. రోశయ్యపై కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ఫిర్యాదులు లేవు. గతంలో 1990ల్లో మర్రి చెన్నారెడ్డి గవర్నర్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో వైరం కొనసాగుతూ వచ్చింది. రోశయ్య సహజంగానే ఘర్షణలకు దూరంగా ఉంటారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితతో రోశయ్య సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే, వీరిద్దరిని మోడీ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగిస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications