‘పురుషుడి శరీరంలో చిక్కుకున్నా’: మహిళగా మారిన నేవీ అధికారి!
అతడు పురుషుడే... కానీ మహిళ కావాలనే కోరిక బలంగా ఉంది. దీంతో నేవీలో పనిచేస్తున్న సమయంలోనే సర్జరీ చేసుకుని మహిళగా
విశాఖపట్నం: అతడు పురుషుడే... కానీ మహిళ కావాలనే కోరిక బలంగా ఉంది. దీంతో నేవీలో పనిచేస్తున్న సమయంలోనే సర్జరీ చేసుకుని మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో నేవీ దళంలో పురుషుడిగా పనిచేసి ఇప్పుడు మహిళగా పని చేయడం కొంత ఇబ్బందిగా పరిణమించింది. దీంతో ఆమెగా మారిన అతడ్ని విధుల నుంచి తప్పుకోవాలని కోరారు నేవీ అధికారులు. దీనికి ఆమె సంతోషంగా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైంది.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం ఐఎన్ఎస్ ఏకశిల బేస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆ నావికుడు కొన్ని నెలల క్రితం లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ కోసం కొందరు సన్నిహితులను సంప్రదించాడు. ఆ తర్వాత తన సొంత డబ్బుతోనే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు అని నేవీ వర్గాలు వెల్లడించాయి.

'ప్రస్తుతం అతడు మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అతడు నావికాదళంలో విధులు నిర్వర్తించడం చాలా కష్టం. మరో వైపు తోటి ఉద్యోగులు కూడా అతడి(ఆమె)తో పని చేసేందుకు ఇబ్బందిగా భావిస్తున్నారు. అందుకే అతని స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగాలని కోరాం. వెంటనే అతడు సంతోషంగా అంగీకరించాడు' అని ఓ నావికాదళం అధికారి చెప్పారు.
ఇలాంటి సందర్భాల్లో ఆమెగా మారిన అతడిపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవడంతో రక్షణమంత్రిత్వ శాఖను నేవీ అధికారులు సంప్రదించినట్లు తెలుస్తోంది.
కాగా, 'నేనొక పురుషుడి శరీరంలో చిక్కుకున్న మహిళను' అంటూ తరచూ అతడు వ్యాఖ్యానించేవాడని అతని సహచరులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఆపరేషన్‌కు ముందే అతనికి వివాహం కూడా జరిగినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications