బిల్లులో పలు సవరణలు: ఆర్నెల్లలో రాజధాని

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధానిని 45 రోజుల్లో ఎంపిక చేయనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం లోకసభ ఆమోదం తెలిపిన బిల్లులో పలు సవరణలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 38 సవరణలను లోకసభ ఆమోదించింది. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఆరు నెలల్లోగా ఎంపిక చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పిఎఫ్, పెన్షన్, బీమా ఫండ్లను శిక్షణా సంస్థలు, కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లను పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవచ్చునని మరో కీలక సవరణ చేసింది. ఇక పోలవరానికి తెలంగాణ ఆమోదం తెలిపినట్లే భావించాలని, ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంతో పాటు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని బిల్లులో తాజాగా చేర్చారు.

New capital for Seemandhra

విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్వవిభజన జరపాలని, అయితే ప్రస్తుతానికి ఇప్పడున్న స్థానాలకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం పేర్కొంది. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పదేళ్లపాటు తగిన చర్యలు తీసుకుంటుందని సవరణ చేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇరు రాష్ట్రాలకూ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే సీమాంధ్ర అభివృద్ధికి తగిన గ్రాంట్లు, ఆర్థిక వనరులు, రాయితీలు సీమ, ఉత్తర కోస్తా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఉద్యోగులు ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బదిలీ చేయాలని, ఏదైనా వివాదం తలెత్తితే కేంద్రానిదే తుది నిర్ణయమని బిల్లులో స్పష్టం చేసింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, బిజెపి నేతలు సూచించిన పలు అంశాలను కూడా కేంద్రం సవరణల రూపంలో ప్రతిపాదించింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతరాయ్ ప్రతిపాదించిన ఐదు సవరణలు, మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సూచించిన 18 సవరణలను సభ తిరస్కరించింది.

కేంద్రం సవరణల్లో.... సీమాంధ్రకు కొత్త రాజదాని, నియోజకవర్గాల పునర్విభజన, పోలవరం ముంపు ప్రాంతాల అంశం, పలు ప్రాజెక్టులు, ఉద్యోగుల బదలీ తదితర అంశాలు ఉన్నాయి. అసదుద్దీన్ పలు సవరణలు ఇచ్చారు. కానీ వాటిని కేంద్రం తిరస్కరించింది. హైదరాబాదుపై గవర్నర్ పెత్తనంపై కోర్టుకెళ్తానని చెప్పారు. మరోవైపు పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రకు ఇచ్చి, ప్రాజెక్టు బాధ్యతను కేంద్రం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+