అరుదైన గౌరవం: కవిత ఫొటోతో బ్రిటన్, న్యూజిలాండ్‌లో స్టాంపులు రిలీజ్
హైదరాబాద్: మహిళల ప్రతిష్టాత్మక పండగ బతుకమ్మను, తెలంగాణ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటుతున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు న్యూజిలాండ్, బ్రిటన్‌లో అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కవితపై బ్రిటన్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు పోస్టల్ స్టాంపులను విడుదలచేశాయి.
Personalised stamps created & released by TRS Australia team in Newzealand & UK. Thanks for the gesture. Jai Telangana !!! pic.twitter.com/NP4uHl2kuF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 20, 2016

కవిత పేరిట పోస్టల్ స్టాంపులు
బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ద్వారా మహిళల ప్రాధాన్యాన్ని పలుదేశాల్లో చాటిన కవిత పేరిట స్టాంపులను విడుదలచేయాలని టిఆర్ఎస్ ప్రవాస తెలంగాణశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేశారు.

డాలర్ విలువ చేసే స్టాంప్
న్యూజిలాండ్‌లో డాలర్ విలువచేసే పోస్టల్ స్టాంపుపై బతుకమ్మను ఎత్తుకున్న కవిత చిత్రం, తెలుగులో ‘శుభాకాంక్షలు' ఉన్నాయి. బ్రిటన్ ప్రభుత్వం ఆవిష్కరించిన ఫస్ట్‌క్లాస్ స్టాంపుపై కవిత చిత్రం ఉంది.

కవితకు అందజేత
ప్రవాసశాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, కార్యదర్శి అభినయ్ సోమవారం హైదరాబాద్‌కు వచ్చి, తెలంగాణ భవన్‌లో కవితకు వీటిని అందజేశారు. న్యూజిలాండ్, లండన్‌లోని టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖల బాధ్యులు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి ఎంపీ కవిత పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

ఆయా దేశాల్లో పర్యటన
బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎంపీ కవిత.. బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికాతోపాటు మరికొన్ని దేశాల్లోనూ పర్యటించారు. అక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications