సీఎం జగన్ మార్క్ లెక్కలు - అక్కడే కీలక మలుపు : సక్సెస్ అయితే..అడ్డే లేదిక..!!

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా ప్రజలతో పార్టీ నేతలు మమేకం అయ్యే నిర్ణయాలు తీసుకుంటూనే..పాలనా పరం గా తమ మార్క్ లెక్కలతో సిద్దం అవుతున్నారు.

ఇందుకోసం మిగిలిన ఏడాది సమయం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖ కేంద్రంగా జరిగే కార్యక్రమాలు జగన్ కు ఎన్నికల వేళ కీలకగా మారునున్నాయి. అక్కడ సక్సెస్ కనిపిస్తే..ఇక అడ్డే ఉండదని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం వచ్చే నెల కీలకం కానుంది. ఎన్నికల వేళ ఇప్పుడు అందరి ఫోకస్ అటే కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం ఇందుకోసం సిద్దమవుతున్నారు.

సంక్షేమం ఓకే - అభివృద్ధి పై ఫోకస్

సంక్షేమం ఓకే - అభివృద్ధి పై ఫోకస్

ఏపీలో జగన్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లొ 95 శాతం మేర పూర్తి చేసారు. రాష్ట్రంలో దాదాపు 88 శాతం మందికి సంక్షేమం అందిస్తున్నారు. ఇదే ఆయుధంగా వచ్చే ఎన్నికల్లొ వై నాట్ 175 సీట్ల ధీమాగా ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఏపీలో అభివృద్ధి లేదనే ప్రచారం జోరు పెంచారు.

ఏపీకి పెట్టుబడులు రాలేదని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి వచ్చిన పెట్టుబడులు..దక్కిన ర్యాంకులు..చేయబోతున్న కార్యక్రమాల పైన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానంలో ఏపీ నిలిచింది. 11.43 శాతం వృద్ధి రేటుతో మిగలా రాష్ట్రాల కంటే మిన్నగా ఉంది. పెట్టుబడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది.

ఏపీలో తలసరి ఆదాయం 38.5 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు..తమ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను వివరిస్తోంది.

టీడీపీ - వైసీపీ హయాంలో ఇలా

టీడీపీ - వైసీపీ హయాంలో ఇలా

ఏపీ ప్రభుత్వం రానున్న ఏడాది కాలం అటు సంక్షేమం కొనసాగిస్తూ...ఇటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వనుంది. చంద్రబాబు హయాంలో సగటున రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల వ్యవధిలోనే తాము సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు.

పెట్టుబడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. 38.5 శాతం ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లను అభివృద్ధి చేస్తున్నామని తాజాగా ఢిల్లీ కేంద్రంగా పారిశ్రామిక వేత్తల సమావేశంలోనూ సీఎం జగన్ చెప్పారు. మూడేళ్లలోనే 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు.

వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఓవరాల్ గా 6.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. ఆర్టీసీని విలీనం చేసి 51,387 ఉద్యోగాలు ఇచ్చామని, వైద్య రంగంలో 16,880 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 2.60 లక్షల మంది వాలంటీర్లుగా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

విశాఖలో ఆ రెండు రోజులు - కీలక మలుపు

విశాఖలో ఆ రెండు రోజులు - కీలక మలుపు

ఇదే సమయంలో మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించింది.

అడ్వాంటేజ్‌ ఆంధ్రా అనే పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. మెరైన్‌ ఉత్పత్తులు, ఆగ్రో ఫుడ్‌ ప్రోసెసింగ్‌, డిఫెన్స్‌ ఉత్పత్తులు ఈ సమ్మిట్‌ లో ప్రదర్శిస్తారని విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారు. ఇక..ఏపీ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ బోర్డు సమావేశం లో కొత్త పెట్టబడులకు ఆమోదం తెలిపారు.

ఇక.. విశాఖ కేంద్రంగా జరిగే సదస్సులో కుదిరే ఒప్పందాలు..పెట్టుబడులు-ఏపీలో ఉపాధి కల్పన ఎన్నికల వేళ కీలక మలుపు కానుంది. ప్రభుత్వం ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ సదస్సు సక్సెస్ చేయటం ద్వారా ఎన్నికల వేళ మరింత సానుకూల వాతావరణం పెంచుకోవాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+