Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పనామా పేపర్స్‌లో హైదరాబాద్ చిరునామాలు ఇవీ

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పనామా పత్రాల డాటాబేస్‌లో హైదరాబాద్‌కు చెందిన చిరునామాలు కూడా ఉన్నాయి. అందులో 16 చిరునామాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ చిరునామాలు ఒక్కొక్కటి ఉన్నాయి. తాము సేకరించిన లక్షలకొద్దీ పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్థ ఆన్‌లైన్‌లో ప్రపంచానికి అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.

ఆ డాటాబేస్‌లో తెలంగాణ నుంచి కూడా పలువురి పేర్లు, చిరునామాల లింకులు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక గురువారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక అందించిన వివరాలను యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాం. ఆ చిరునామాలు ఇవీ...

1.-101 వైభవ్ అపార్ట్‌మెంట్స్; ఏ-2-1069, రాంకోఠి, హైదరాబాద్. ఈ లింకును క్లిక్ చేస్తే అజయ్‌కుమార్ మల్పాని, రహదిలాల్ విజయ్‌కుమార్ పేర్లను చూపిస్తోంది

2.-3659 ఎంఐజీ ఫేజ్ 2, బీహెచ్‌ఈఎల్, రామచంద్రాపురం హైదరాబాద్. ఈ లింకును క్లిక్ చేస్తే తంగమణి ఇలంగోవన్ పేరు వస్తున్నది.

3.-8-3-615/4 బీ; ఫ్లాట్ నంబర్ 203, రోడ్డు నంబర్ 11, మీనాక్షి రాయల్‌కోర్ట్ అపార్ట్‌మెంట్స్, బంజారాహిల్స్. ఈ లింకులో వోలం భాస్కర్‌రావు, భావనాసి జయకుమార్ పేర్లు కనిపిస్తున్నాయి. ఈ చిరునామాలో మొత్తం తొమ్మిది లింకులు ఉన్నాయి. రెండింటిలో ఫ్లాట్ నంబర్ 204గా ఉంది. రెండు లింకుల్లో సంస్థ పేరు లోటస్ సస్టెయినబుల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది.

Panama papers contains 16 Hyderabad addresses

4.-ఫ్లాట్‌నంబర్ 103; ఇంటి నంబర్ 16-11-20/డీ/4, సలీంనగర్ కాలనీ, గంగసాయి గ్రాండ్యుయర్, మలక్‌పేట. ఈ లింకులో సురేశ్‌కుమార్ చందా పేరు ఉంది.

5.-ఇంటి నంబర్ 6-3-630/1; 11 రామసాయీస్-సింఫనీ డ్వెల్లింగ్స్, ఆనంద్‌నగర్, ఖైరతాబాద్. ఈ లింకులో వెంకటాచలం గెడుపూడి పేరు ఉన్నది.

6.-ప్లాట్ నంబర్ 110, రోడ్డు నంబర్ 10, జూబ్లీహిల్స్ పేరుతో ఉన్న లింకు క్లిక్ చేస్తే ప్లాట్‌నంబర్ 106, నాజ్‌నిన్ విల్లా, లేన్-హెచ్, సెక్టర్-8; వాషి, నవీముంబై 400703 చిరునామా చూపిస్తున్నది. ఈ లింకులో సాజిద్ సైఫీ వరావల్లా పేరు ఉంది.

7.-ప్లాట్ నంబర్ 46, రోడ్డు నంబర్ 13, బంజారాహిల్స్ పేరిట ఉన్న లింకు క్లిక్ చేస్తే ప్లాట్ నంబర్ 3/138;కేరాఫ్ పోస్టుబ్యాగ్ 188; ఎన్‌జెవా, లియాంగ్వే, మలావి అడ్రస్ చూపిస్తున్నది. ఈ లింకులో షమీనా ఇర్ఫాన్ తయూబ్ పేరు ఉన్నది.

8.-ప్లాట్ నంబర్ 27, నవోదయ కాలనీ రోడ్డు నంబర్ 14, బంజారాహిల్స్ లింకులో త్రివిక్రమప్రసాద్ పిన్నమనేని అనే పేరు చూపిస్తున్నది. ఇదే పేరుతోపాటు శ్రుతి పిన్నమనేని పేరుతో మరో లింకు ఉన్నది. ఈ లింకులో ఎక్లిప్స్ క్యాపిటల్ కంపెనీ ఇంటర్‌ప్రైజెస్ అనే సంస్థ పేరును సూచిస్తున్నది. అయితే ఇది ఎక్కడున్నదీ తెలియలేదని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. శ్రుతి పిన్నమనేని పేరిట ఇదే చిరునామాతో మరో లింకు ఉన్నది.

9.-ప్లాట్ నంబర్ 1242, రోడ్డు నంబర్ 62, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఈ లింకులో తేజ రాజు బైర్రాజు పేరు ఉన్నది. కంపెనీ పేరు షేర్‌క్రాప్ లిమిటెడ్ అని పేర్కొంటున్నది. దీనికి ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర అనేక దేశాలతో సంబంధం ఉన్నట్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

10.-ప్లాట్ నంబర్ 18, సాగర్ సొసైటీ, రోడ్డు నంబర్ 2, బంజారాహిల్స్. ఈ లింకులో ఈశ్వరరావు గ్రంధి పేరు ఉన్నది.

11.-ప్లాట్ నంబర్ 1114, రోడ్డు నంబర్ 54, జూబ్లీహిల్స్. ఈ లింకులో అశోక్ దేవినేని పేరు ఉన్నది.

12.-6-3-1238/ఏ, రేణుక ఎన్‌క్లేవ్, ఎలిగెంట్ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా, రాజ్‌భవన్ రోడ్డు, సోమాజిగూడ. ఈ లింకులో వివేకానంద్ గడ్డం, సరోజా వివేకానంద్ గడ్డం పేర్లు ఉన్నాయి.

13.-ప్లాట్ నంబర్ 387, రోడ్డు నంబర్ 22, జూబ్లీహిల్స్. ఈ లింకులో స్మార్ట్ లెజెండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, కేడబ్ల్యూఎస్ హోల్డింగ్స్‌అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు వహీదా ఉస్మాన్ పద్బిద్రి, ఖలీల్ అహ్మద్ షేక్‌లతో సంబంధం ఉన్నవిగా చూపించారు.

14.-1328, రోడ్డు నంబర్ 66, జూబ్లీహిల్స్. ఈ లింకులో అనురాగ్@బంటీ గార్గ్, అశ్వినాగార్గ్ పేర్లు ఉన్నాయి.

15.-707 క్రిషీ గార్డెన్స్, 5-80-373, హుడా లేన్, బేగంపేట్. ఈ లింకులో విజయ్ అగర్వాల్ పేరు ఉంది.

16.-ప్లాట్ నంబర్ 46, సిద్ధార్థ నగర్. ఈ లింకులో పినాక వెంకట రాంప్రసాద్ రెడ్డి పేరు ఉంది.

17.-కరీంనగర్‌లోని 5-105/1ఏ, సుల్తాన్‌పూర్, ఎలిగేడు చిరునామాతో ఒక లింక్ ఉన్నది. దీనిని క్లిక్ చేస్తే అనిల్ దుగ్యాల పేరు కనిపిస్తున్నది.

18.-నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2-7-68/1, వీక్లీ బజార్ లింకులో వేణుగోపాల్ బచ్చు పేరు ఉన్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+