సీట్లు వద్దు: పవన్ టార్గెట్ 2019, టిడిపికి ప్రచారం

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. స్వయంగా ఆయన గానీ, ఆయన పార్టీ గానీ పోటీ చేసే అవకాశాలు లేదంటున్నారు. తెలుగుదేశం - బిజెపిలకు మద్దతివ్వాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ తన పార్టీకి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నారు. 2014లో కాకుండా 2019లో ఆయన పార్టీ పోటీ చేసే అవకాశముందంటున్నారు. పవన్ అదే ఆలోచిస్తున్నారట.

ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం రెండు ప్రాంతాల్లో కాంగ్రెసును, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలను దెబ్బతీయడమే ఆయన లక్ష్యంగా ఉందని చెబుతున్నారు. తాను పోటీ చేయకపోయినా టిడిపి, బిజెపిలకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లేమీ అడగరాదని, తాను కూడా ఎక్కడా పోటీ చేయరాదని తీర్మానించుకున్నరాట.

Pawan for defeat of YSRCP and TRS

తెలుగుదేశం పార్టీ ముందు తన ఆలోచనలు పెట్టి, వాటికి ఆ పార్టీ ఆమోదం తెలిపితే, వాటి ప్రాతిపదికగా పవన్ ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 'అభివృద్ధికి సంబంధించి పవన్ కొన్ని స్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి అంతా రకరకాల కారణాలతో హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. సీమాంధ్రలో ఈసారి అటువంటి పొరపాటు జరగరాదన్నది ఆయన అభిమతం.

అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని, అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందే వాతావరణం, అవకాశాలు, వసతులు కల్పించాలని ఆయన కోరుకొంటున్నారు. దీంతోపాటు యువత కేవలం ఉద్యోగాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా సొంతంగా పరిశ్రమలు, స్వయం ఉపాధి చర్యలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన కోరుకొంటున్నారు.

ఇవన్నీ త్వరలో ఆయన టిడిపి ముందు పెట్టనున్నారట. ఆ పార్టీ దానికి ఆమోదం తెలిపితే ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, తెలంగాణలోనూ ఆయన ప్రచారం చేస్తారని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పవన్ ఒకటి రెండు ప్రతిపాదనలు ముందుకు తెచ్చే అవకాశం ఉందంటున్నారు.

పార్టీ నెలకొల్పిన తర్వాత ఎన్నికల్లో పాల్గొనడానికి మరీ తక్కువ వ్యవధి ఉండటంతో ఇప్పుడు అటువంటి ప్రయత్నాలేవీ చేయరాదని పవన్ భావిస్తున్నారట. పార్టీని పకడ్బందీగా నిర్మించి వీలైతే 2019 ఎన్నికల బరిలో దిగాలన్నది ఆయన ఆలోచన అంటున్నారు. బిజెపితో పవన్ ఇంతవరకూ నేరుగా చర్చలేవీ జరపలేదని, టిడిపితో బిజెపి పొత్తు కుదుర్చుకొంటే ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేస్తారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+