పవన్ ఎఫెక్ట్‌పై బాబు సీక్రెట్ సర్వే: ప్రశ్నలివే...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సర్వే ప్రారంభమైనట్లు 29వ తేదీన ముగియనున్నట్ుల మీడియాలో వార్తలు వచ్చాయి.

రాష్ట్ర నిఘా విభాగం ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని 9 ప్రశ్నలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నిఘా విభాగం అదనపు డిజి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ప్రతి శాసనసభా నియోజకవర్గం నుంచి వంద మందిని సాంపుల్ సైజ్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంపుల్ సైజులో అన్ని వయస్సులవారూ ఉన్నారు. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో నిఘా విభాగానికి చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పది మంది కానిస్టేబుల్ సర్వే పనిలో నిమగ్మయ్యారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను కవర్ చేస్తూ ప్రతి కమ్యూనిటీని తమ సర్వే కోసం ఎంపిక చేసుకుంటారు.

Pawan Kalyan entry: Cops busy with survey on AP politics

ప్రశ్నలు ఇవే....

1. జనసేన ప్రజా సమస్యలను పట్టించుకుంటోందా, వాటిపై ప్రతిస్పందన ఎలా ఉంది?

2. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుందా?

3. ఏ పార్టీ మద్దతు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుంది?

4. ఏ కమ్యూనిటీలు జనసేనకు మద్దతు ఇస్తున్నాయి?

5. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి అయ్యే సామర్ధ్యం ఉందని భావిస్తున్నారా?

6. వచ్చే ఎన్నికల్లో జనసేన బలం పుంజుకుంటేఏ పార్టీ నష్టపోతుంది?

7. 2014 ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు?

8. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?

9. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించే సామర్థ్యం జనసేన పార్టీకి ఉందా?

ఈ ప్రశ్నలతో నిఘా విభాగం చేస్తున్న సర్వే ఫలితాలు ఈ నెల 30వ తేదీన చంద్రబాబు చేతికి రావచ్చునని భావిస్తున్నారు. జనసేనకు రాయలసీమలో, కోస్తాల్లో కన్నా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మద్దతు లభిస్తున్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+