పవన్ కల్యాణ్: చంద్రబాబు ఆత్మరక్షణ, బిజెపి కార్నర్

విజయవాడ: ప్రత్యేక హోదాపైనే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణ పద్ధతిని అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో రకంగా పవన్ కల్యాణ్ బిజెపిపై అస్త్రాలు ఎక్కుపెట్టడం చంద్రబాబును ఖుషీ చేసినట్లే కనిపిస్తోంది.

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడానికి అంగీకరిస్తూనే మరోవైపు ప్రత్యేక హోదాను వదిలిపెట్టలేదనే సంకేతాలను ఆయన బలంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.తద్వారా ఆత్మరక్షణ విధానాన్ని అనుసరిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై బిజెపిని కార్నర్ చేయడానికి పూనుకున్నట్లు కనిపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉండడంతోప్రత్యేక హోదాను ఆయన బిజెపిపై అస్త్రంగా ప్రయోగించదలుచుకున్నారు. పవన్ కల్యాణ్ కాకినాడ సభలో చంద్రబాబును ఎక్కువగా విమర్శింకపోవడం గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

Pawan Kalyan fight: Chandrababu strategy to corner BJP

బిజెపిపై, వెంకయ్య నాయుడిపై పవన్ కల్యాణ్ చాలా దూకుడు ప్రదర్శించారు. వెంకయ్య నాయుడు పార్టీని నాశనం చేశారని, బిజెపి నాయకులంతా బయటకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎంపీలను మాత్రమే పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఎంపీలను తప్పు పట్టారు. ఒళ్లంతా కారం పూసూకుని ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

తాము ప్రత్యేక హోదాను వదిలిపెట్టలేదనే వ్యూహాత్మక ప్రకటన ద్వారా చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తున్నట్లే కనిపిస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ పోరాటం తమకు ఉపయోగపడుతుందని కూడా చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. పైగా, చంద్రబాబును ఎక్కువగా విమర్శించకపోవడం వల్ల పవన్ కల్యాణ్ ఇంకా ఆయన వెంటే ఉన్నారనే సంకేతాలు వెళ్తాయనే భావన నెలకొని ఉంది. ఇది కూడా చంద్రబాబుకు కలిసి వస్తుంది.

బిజెపి నాయకులంతా బయటకు రావాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలనే పిలుపునివ్వకపోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబును ఎందుకు ఆయన అడగలేకపోయారనేది మరో ప్రశ్న. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని సూచించిన పవన్ కల్యాణ్ బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని అడగకపోవడం వెనక ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

తన వెనక బిజెపి ఉందని, టిడిపి ఉందని విమర్శిస్తున్నారని, తాను ఒక్కడినే ఉన్నానని, తనకు పౌరుషం లేదా అని పవన్ కల్యాణ్ అడిగారు. అలా అన్నప్పటికీ చంద్రబాబుతో ఆయన సంబంధాన్ని కొట్టిపారేయలేమనే సంకేతాలను పవన్ కల్యాణ్ కొట్టిపారేయలేమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+