పవన్ రైటా: ఎన్టీఆర్, చిరులకు భిన్నంగా (పిక్చర్స్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ రాజకీయాల్లోకి రావడం తప్పిదమని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలను ప్రక్షాణన చేయాలనుకుంటే మాత్రం ఇది సమ్మతమేనని ఇంకొందరు చెబుతున్నారు. టాలీవుడ్ నుండి 1983లో ఎన్టీఆర్, 2008లో చిరంజీవి పార్టీ పెట్టారు. ఇప్పుడు పవన్ పార్టీ వస్తోంది. అయితే, వారికి, పవన్‌కు తేడా ఉందని చెబుతున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు 1983లో రాజకీయ శూన్యత ఉన్న సమయంలో పార్టీని స్థాపించారు. అప్పుటికే ఎన్టీఆర్‌కు ఎపిలో భారీ క్రేజ్ ఉంది. ఆయనను రాముడిగా, కృష్ణుడిగా ప్రజలు చూశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు అది ఆయనకు దాదాపు సినిమా కెరీర్ ముగింపు సమయమనే చెప్పవచ్చు. ఎన్టీఆర్ పట్ల ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ... అప్పుడు కొత్తతరం వస్తోంది. ఆ సమయంలో ఆయన పార్టీని స్థాపించారు.
2008లో చిరంజీవి పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయనకు కెరీర్ ముగింపు దశనే అని చెప్పవచ్చు. దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను ఏలిన చిరు... కొత్తతరం దూసుకొస్తున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. అయితే పవన్ మాత్రం పార్టీని తన పీక్ స్టేజిలో పెడుతున్నారు.
చిరంజీవి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ నెంబర్ వన్ స్థానంలో దాదాపు ఖాయమైపోయారు. గత కొంతకాలంగా యువ నటుల మధ్య మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆసక్తికరమైన విషయమేమంటే... వరుసగా ఏళ్ల కొద్ది చిత్రాలు ఫెయిల్ అయినా పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన సినిమాకు వచ్చే కలెక్షన్స్ అదుర్స్. గబ్బర్ సింగ్ హిట్‌తో పవన్ ఫాంలోకి రావడమే కాదు... చిరు స్థానాన్ని భర్తీ చేస్తాడని అందరూ లెక్కలు వేశారు.
ఒకవిధంగా చెప్పాలంటే... చిరు ఇమేజ్‌ని పవన్ ఎప్పుడో దాటేశారనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్, చిరులు చిత్ర రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన తర్వాత పార్టీని స్థాపించారు. స్టార్ డమ్ ఉన్న పవన్ మాత్రం పీక్ స్టేజీలో... చిత్ర పరిశ్రమలో తనకు దాదాపు మరో దశాబ్దం కాలానికి పైగా హవా ఉండనున్న ఈ సమయంలో పార్టీని స్థాపిస్తుండటం గమనార్హం. పవన్ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని... కాదు కాదు సమాజం కోసం ఆ మాత్రం చేయకుంటే ఎలా అంటున్నారు.

పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ జనసేన. పవన్ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్
మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఉన్న సమయంలో నాటి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

చిరంజీవి
ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత చిరంజీవి 2008లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన తన కెరీర్ ముగింపు దశలో పార్టీని స్థాపించారు.

జనసేన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి తన పీక్ స్టేజిలో వస్తున్నారు. వరుసగా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ సినిమా కలెక్షన్స్ అదిరేలా ఉంటాయి. గబ్బర్ సింగ్‌తో ఇటీవలో పెద్ద హిట్ సాధించారు. ఇలాంటి పీక్ స్టేజిలో పవన్ పార్టీ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications