తెలంగాణ: చిరంజీవి తల్లి ఆందోళన వ్యక్తం చేశారా?
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం తన ప్రచారంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతిస్తున్న పవన్... ఆ పార్టీల అభ్యర్థుల తరఫున సీమాంధ్రలో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఉత్తరాంధ్ర ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ... హైదరాబాదులో ఉన్న తమ అమ్మ ఓ సందర్భంలో తనతో... మనం ఇక్కడ ఉండలేమా అని చెప్పారని, ఒక కేంద్రమంత్రి (చిరంజీవి) తల్లి ఈ విధంగా అన్నారంటే హైదరాబాదులోని సీమాంధ్రుల్లో ఎలాంటి అభద్రతా భావం ఉందో అర్థమవుతోందన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలో విభజనకు దారి తీశాయన్నారు. సీమాంధ్రలాగే తనకు తెలంగాణలోను చాలామంది అభిమానులు ఉన్నారని, గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తాను ఆ ప్రాంతంలోని చాలా తండాలకు వెళ్లానని చెప్పారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు రాష్ట్రాన్ని చెరుకు రసంలా పీల్చి.. పిప్పి చేశారని మండిపడ్డారు.
తెరాస అధ్యక్షులు కెసిఆర్ పదేళ్లపాటు సీమాంధ్రులను నాలుక కోస్తా.. చీరేస్తా అంటుంటే జగన్ ఎప్పుడు మాట్లాడలేదన్నారు. 2004 నుండి వైయస్, జగన్ తెలంగాణలోని భూములు కబ్జా చేసినందునే అఖ్కడి ప్రజలు సీమాంధ్రుల పైన కసి పెంచుకున్నారని విమర్శఇంచారు. ఆ కసిని కెసిఆర్ ఉద్యమం చేసి తన వైపు తిప్పుకున్నారని చెప్పారు. సీమాంధ్ర ఆత్మగౌరవం కాపాడలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నారు.












Click it and Unblock the Notifications