డబ్బు కోసమే 'సర్దార్': పవన్ కళ్యాణ్ చెప్పిన రహస్యం

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తీశారు? పవన్ చేసే రాజకీయాలకు, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధం ఉందా? అంటే అవుననే చెబుతున్నారట.. పవన్ కళ్యాణ్. మూడ్రోజుల క్రితం విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్ల సునామీ కురిపించింది.

ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తీశానో పవన్ కళ్యాణ్.. ఆ రహస్యాన్ని చెప్పారు.

ప్రస్తుతం రాజకీయాలు నడిపేందుకు తన వద్ద డబ్బులేదని, తన వద్ద డబ్బు లేదంటే ఎవరూ నమ్మకపోవచ్చునని, కానీ ఇది నిజంగా నిజమని చెప్పారు. తన వద్ద పని చేసే వారికి కూడా జీతాలు ఇచ్చేందుకు తాను ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. నేను జోక్ చేయడం లేదన్నారు.

Pawan Kalyan

కావాలంటే తన ఐటీ దస్త్రాలు చూసుకోవచ్చునని చెప్పారు. 2019లో జనసేన పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నించగా.. తప్పకుండా పోటీ చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. నేను ఆశావాదినని, తన సామర్థ్యం పైన తనకు నమ్మకం ఉందని చెప్పారు. తాను ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోనని చెప్పారు.

అదే సమయంలో ఓ రహస్యం చెప్పారు! తాను సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని డబ్బు కోసమే చేశానని తెలిపారు. తన వద్ద డబ్బులు లేనందువల్లే వాటి కోసమే సినిమా చేశానని చెప్పారు. తద్వారా.. జనసేన పార్టీ కోసం సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ కూడబెడుతున్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+