14న పవన్ కల్యాణ్ పార్టీ: ముందే టిడిపి చెవిలో..?

హైదరాబాద్: తాను కొత్త పార్టీ పెట్టనున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నేతలకు ముందే చెప్పారట! పవన్ టిడిపిలోకి వస్తారని గతంలో ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు పవన్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం.

తమ పార్టీలోకి రావాలని, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారట. దానికి పవన్ సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. తాను సొంతగా పార్టీ పెట్టాలని భావిస్తున్నానని, అందువల్ల ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారట. తన రాజకీయ అభిప్రాయాలను తన పార్టీ ద్వారానే ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారని అంటున్నారు.

Pawan Kalyan

14న పార్టీపై ప్రకటన?

కాగా, పవన్ కల్యాణ్ ఈ నెల 14వ తేదీన పార్టీ పైన ప్రకటన చేయవచ్చునని తెలుస్తోంది. మొదట 12వ తేదీ అనుకున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే రోజు రాజమండ్రిలో బహిరంగ సభ పెడుతున్నందున ముందుకు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, దానిని 14వ తేదీకి మార్చినట్లుగా చెబుతున్నారు.

హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్ పేరు మీద 14వ తేదీన ఓ హాలును బుక్ చేశారట. దీనికి రావాల్సిందిగా అభిమానులకు ఆహ్వానాలు కూడా అందాయంటున్నారు. సాయంత్రం పవన్ తన అభిమానులతో మాట్లాడి రాజకీయంపై తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించి, పార్టీ ప్రకటన చేసే అవకాశముందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+