మాది అయోమయ దేశం, జిన్నా తప్పిదం: పాక్ మేధావి

హైదరాబాద్: అయోమయంలో పుట్టిన పాకిస్థాన్‌, ఇంకా అయోమయంలోనే జీవిస్తోందని, ప్రపంచీకరణ ప్రభావంతో మా ప్రజల్లోనూ మార్పు వస్తుందని, ప్రజాస్వామ్య లౌకిక దేశంగా పాకిస్థాన్‌ ఆవిర్భవిస్తుందని పాకిస్థాన్‌ రచయిత, శాస్త్రవేత్త పర్వేజ్‌ అమిరాలి హుద్‌భోయ్ శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ సాంస్కృతిక వేడుకలో భాగంగా శనివారం పాకిస్థాన్‌ పునరాకృతిపై ఆయన ప్రసంగించారు. హిస్టరీ ప్రొఫెసర్, రచయిత వెంకట్‌ ధూళిపాల పాల్గొన్నారు.

పాకిస్థాన్‌ ఆవిర్భావానికి కారణమైన జిన్నాపై పర్వేజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. హిందూ, ముస్లింలవి భిన్న సంస్కృతులు కాబట్టి, రెండు దేశాల సిద్ధాంతాన్ని జిన్నా ప్రతిపాదించాడని, ఫలితంగా పాకిస్థాన్‌ ఆవిర్భవించిందని, 1971లో మతపరంగా దేశ విభజన సిద్ధాంతం తప్పని తేలిపోయిందన్నారు.

Pervez Amirali Hoodbhoy on muhammad ali jinnah

తూర్పు, పశ్చిమ పాకిస్థాన్‌లను కలిపి ఉంచటానికి మతం సరిపోలేదని, అలాంటప్పుడు పాకిస్తాన్ పుట్టుకకు మూలమేంటనే ప్రశ్న నేటికీ అలాగే ఉందని, అలీ జిన్నా స్వతహాగా అయోమయ వ్యక్తి అని, పాకిస్థాన్‌ను ముస్లిం ప్రజల ఆధిపత్య దేశంగా ఉంచాలో, ఇస్లాం మతరాజ్యంగా ఉంచాలో తేల్చుకోలేకపోయాడన్నారు.

ఆ రెండింటికీ మధ్య అంతరం ఆయనకు అర్థం కాలేదని, ఖురాన్‌లో దేశమనే పదమే లేదని, ఇస్లాం భిన్న ప్రాంతాల్లో, సమయాల్లో భిన్నంగా ఉంటుందన్నారు. టర్కీ, మలేషియాలోని ఆధునిక ఇస్లాంకు... ఇరాన్, ఇరాక్‌ల్లోని ఇస్లాంకు, పాకిస్థాన్‌లోని ఇస్లాంకు తేడాలున్నాయన్నారు.

అందుకే ముస్లింలు ఐసిస్ తీవ్రవాదానికి మద్దతివ్వటం లేదన్నారు. ముస్లిం మతపెద్దలు జిన్నాను ముస్లింగానే గుర్తించలేదని, సరిగ్గా ఉర్దూ మాట్లాడలేని జిన్నా పాకిస్థాన్‌లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించటానికి ప్రయత్నించాడని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది మరో ఘోర తప్పిదమన్నారు.

జిన్నా తర్వాత అయూబ్ ఖాన్‌ సమయంలో పాకిస్థాన్‌ పాశ్చాత్యదేశంగా మారుతున్నట్లు కనిపించిందని కానీ భుట్టో, ఆ తర్వాత జియా ఉల్‌హక్‌ రాకతో అంతా మారిపోయిందన్నారు. ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడతామనే నమ్మకం తనకుందన్నారు.

ఆధునిక ప్రపంచంలో, ప్రపంచీకరణ ఫలితంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ రాకతో ప్రపంచంలోని ప్రభావాలు పాకిస్థాన్‌ ప్రజలపై పడతాయని, వారి ఆలోచనారీతులు మారుతాయన్నారు.

భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ అంత అందంగా కన్పించకపోవచ్చు.. కానీ మేం స్నేహకాముకులమని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులున్న పాకిస్థాన్‌ను చూడాలనుకుంటున్నానని, దీనిని ప్రస్తుతం పాకిస్థాన్‌లో చాలామంది అంగీకరించకపోవచ్చన్నారు. అయినా నా కల అలాగే ఉంటుందని పర్వేజ్‌ అమిరాలి హుద్‌భోయ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+