వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, కేసీఆర్ సరదాగా, గవర్నర్ ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కలుసుకోవడం, ఆప్యాయంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలకడం కోసం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి, పరస్పరం పలకరించుకోవడమే కాకుండా.. కరచాలనం చేసుకున్నారు, ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కేసీఆర్ స్వయంగా బాబును వీఐపీ సీటు వద్దకు తీసుకు వెళ్లారు. బాబు కేసీఆర్ భుజం తడ్డి ప్రశంసించారు.

కేసీఆర్, బాబులు ఆప్యాయంగా, నవ్వుతూ మాట్లాడుతుంటే వారితో గవర్నర్ జత కలిశారు. ఇద్దరు సీఎంలతో గవర్నర్ సరదా సంభాషణ సాగించారు. చంద్రబాబు, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, కే కేశవ రావులతోను మాట్లాడారు. కరచాలనం చేశారు.

గవర్నర్‌కు ఇరువైపులా సీఎంలు కూసుకున్నారు. ప్రణబ్‌కు స్వాగతం పలికాక బాబు అటు నుండి అటే వెళ్లిపోయారు. ఇరువురు సీఎంలు ఉత్సాహంగా, ఆప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడున్న మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులను ఆశ్చర్యపరిచింది.

బాబు, కేసీఆర్ కరచాలనం

బాబు, కేసీఆర్ కరచాలనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరచాలనం చేస్తున్న దృశ్యం.

బాబు, కేసీఆర్, నరసింహన్

బాబు, కేసీఆర్, నరసింహన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరచాలనం చేసిన సమయంలో వారికి గవర్నర్ తోడు అయిన దృశ్యం.

చలాకీగా

చలాకీగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరచాలనం చేసిన సమయంలో వారికి గవర్నర్ తోడు అయిన దృశ్యం. ముగ్గురు కలిసి కాసేపు ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుకున్నారు.

అప్యాయంగా

అప్యాయంగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరచాలనం చేసిన సమయంలో వారికి గవర్నర్ తోడు అయిన దృశ్యం. ముగ్గురు కలిసి కాసేపు ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. కేసీఆర్ భుజం తడుతున్న బాబు.

నిరీక్షణ

నిరీక్షణ

రాష్ట్రపతి రాక కోసం బేగంపేట విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

స్వాగతం పలికేందుకు...

స్వాగతం పలికేందుకు...

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రావడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చిన సమయంలో.. గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్.

పుష్పగుచ్చాలు

పుష్పగుచ్చాలు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగగానే గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యం. పక్కన కేసీఆర్, చంద్రబాబు నాయుడులు.

కేసీఆర్, బాబు

కేసీఆర్, బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆయనను వీఐపీ లాంజ్‌కు తీసుకు వెళ్తూ..

బాబు, కేసీఆర్ కరచాలనం

బాబు, కేసీఆర్ కరచాలనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

బాబు, కేసీఆర్ కరచాలనం

బాబు, కేసీఆర్ కరచాలనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

బాబు, కేసీఆర్

బాబు, కేసీఆర్

రాష్ట్రపతి రాక కోసం బేగంపేట విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

ప్రణబ్‌కు ఆహ్వానం..

ప్రణబ్‌కు ఆహ్వానం..

బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రావడంతో.. వస్తున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు.

బాబు, కేసీఆర్

బాబు, కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

బాబు, కేసీఆర్

బాబు, కేసీఆర్

రాష్ట్రపతి రాక కోసం బేగంపేట విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

ప్రణబ్ వచ్చాడని..

ప్రణబ్ వచ్చాడని..

బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రావడంతో.. వస్తున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు.

భుజం తట్టిన బాబు

భుజం తట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఇలా భుజం తట్టారు....

English summary
Amid bitterness between Telangana and Andhra Pradesh on various issues, the chief ministers of the two states came face to face Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X