మోడీకి మిత్రుడు బాబు: దత్తన్న ఇలా (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి నమ్మకమైన మిత్రుడిగా మారారు. ఢిల్లీలో గానీ ఇతర రాష్ట్రాల్లో గానీ జరిగే బిజెపి ప్రభుత్వాల కార్యక్రమాల్లో చంద్రబాబు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. టిడిపికి విస్తరణలో ఓ మంత్రి పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఆ మంత్రి పదవి దక్కింది. మరో మంత్రి పదవి వస్తే తెలంగాణకు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.

తెలంగాణకు చెందిన ఏకైక మంత్రి బండారు దత్తాత్రేయ. ఆయన ఆదివారం మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో మోడీ తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు. మోడీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన చెప్పారు.

అశోక్ గజపతిరాజుతో చంద్రబాబు

అశోక్ గజపతిరాజుతో చంద్రబాబు

మోడీ మంత్రివర్గంలో పౌరవిమాన యానాల మంత్రిగా పనిచేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడితో పాటు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు.

దత్తాత్రేయకు అభినందనలు

దత్తాత్రేయకు అభినందనలు

ప్రధాని మోడీ మంత్రివర్గంలో చేరిన బండారు దత్తాత్రేయకు అభినందనలు అందజేస్తూ ఇలా కనిపించారు. తెలంగాణ నుంచి దత్తాత్రేయ ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు.

దత్తన్నకు మంత్రి పదవి - వేడుకలు

దత్తన్నకు మంత్రి పదవి - వేడుకలు

తెలంగాణకు చెందిన బిజెపి సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి దక్కడంతో అభిమానులు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

మంత్రిగా ప్రమాణం ఇలా..

మంత్రిగా ప్రమాణం ఇలా..

నరేంద్ర మోడీ విస్తరణలో మంత్రి పదవి దక్కిన బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేస్తూ ఇలా కనిపించారు. ఆయన హిందీలో ప్రమాణం చేశారు.

ప్రధాని మోడీతో ఇలా..

ప్రధాని మోడీతో ఇలా..

ప్రధాని నరేంద్ర మోడీతో కొత్త మంత్రులు ఇలా కొలువు తీరారు. వారిలో తెలంగాణ నుంచి మంత్రివర్గంలో చేరిన బండారు దత్తాత్రేయను కూడా చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+