పవన్‌కు భలే బాబు మర్యాద: ఏమిటీ కథ? (పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మర్యాదలకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. విజయవాడకు రావడానికి ఆయనకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.
అంతేకాదు, విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనం నిలిపే చోటును పవన్ కళ్యాణ్ వాహనానికి కేటాయించారు. భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు బయట వరకు వచ్చి పవన్ కళ్యాణ్‌కు సాదరంగా వీడ్కోలు పలికారు.
పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించి చంద్రబాబు తన రాజకీయంగా ప్రయోజనం పొందారనే మాట మాత్రం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బిజెపికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటన చేయడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.

చంద్రబాబుతో పవన్ భేటీ ఇలా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. పలు విషయాలపై మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కు సత్కారం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించి, సత్కరించారు.

కామినేని శ్రీనివాస్ మధ్యవర్తిగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్‌కు మధ్య సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ప్రచారం సాగింది.

పంచెకట్టులో ఇలా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచెకట్టులో అదరగొట్టారు. చంద్రబాబు క్యాంపు కార్యాలయంలోకి ఇలా అడుగు పెడుతూ కనిపించారు.

చంద్రబాబుతో కరచాలనం
అమరావతి శంకుస్థాపనకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను తిరిగి చేరువ చేసుకోవడానికే ఈ భేటీకి ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబుతో ఇలా...
భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహనం వరకు వచ్చి పవన్ కళ్యాణ్‌ను సాగనంపారు.

మీడియాతో ఇలా..
ప్రత్యేక హోదా ఇవ్వనంటే బిజెపి విషయంలో ఎలా వ్యవహరించాలో ఆలోచిస్తానని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో చెప్పారు.

మూడు విషయాలపై చర్చించాం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తాను మూడు విషయాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ మీడియాతో చెప్పారు.

చంద్రబాబకు సంతోషం కలిగంచారు..
పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన విషయాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆనందం కలిగే ఉంటుంది.

అలాగే వచ్చానని...
హైదరాబాదులో పూజ చేసిన తర్వాత పంచె కట్టులో అలాగే వచ్చేశానని పవన్ కళ్యాణ్ తన పంచెకట్టు విషయంపై చెప్పారు.












Click it and Unblock the Notifications