ఎన్టీఆర్‌కు పురంధేశ్వరి, బాబు విడిగానే (పిక్చర్స్)
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఆయన కుటుంబ సభ్యులు జట్లు జట్లుగా వచ్చి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి విడివిడిగానే నివాళులు అర్పించారు. బుధవారంనాడు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
రాజంపేట లోకసభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పిల్లలతో కలిసి వచ్చి తండ్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ తన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలతో కలిసి వచ్చి తండ్రికి నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయ సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత చంద్రబాబు గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

పురంధేశ్వరి ఇలా...
తన తండ్రి ఎన్టీ రామారావుకు ఎన్టీఆర్ ఘాట్‌కు తన భర్తతో పాటు కలిసి వచ్చి దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించారు.

పురంధేశ్వరి పిల్లలతో...
పిల్లలతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పింపజేస్తూ ఇలా కనిపించారు.

ఎన్టీఆర్ వేషధారి ఇలా..
ఎన్టీఆర్ వేషధారి ఇలా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ 91వ వర్ధంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించారు.

చంద్రబాబు ఇలా...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

బాలకృష్ణ కూడా....
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ కలిసి వచ్చి తన తండ్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

బాలకృష్ణ నివాళులు...
తన తండ్రి ఎన్టీ రామారావుకు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.

నారా లోకేష్ కూడా...
తన తల్లిదండ్రులు భువనేశ్వరి, చంద్రబాబు, మామ బాలయ్యలతో కలిసి నారా లోకేష్ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

నారా లోకేష్ నివాళి..
చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ తన తాత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్
తన తండ్రి నందమూరి హరికృష్ణ, సోదరులు కళ్యాణ్ రామ్, తారకరత్నలతో కలిసి వచ్చి హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications