పవన్ కళ్యాణ్, లోకేష్: జగన్ టార్గెట్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిలకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమైన స్టార్లు దొరికారు. వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై నిప్పులు చెరిగి, వివాదాలకు కేంద్రంగా మారారు. కాంగ్రెసు, తెరాసలను ఓడించడమే లక్ష్యంగా ఆయన బిజెపి, తెలుగుదేశం పార్టీల విజయానికి ప్రచారం సాగించారు.

ఇక, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పూర్తిగా ప్రచారానికే పరిమితమయ్యారు. ఆయన రోడ్ షోలు నిర్వహిస్తూ టిడిపి- బిజెపి కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సీమాంధ్రలో ఎక్కువగా పర్యటించిన నారా లోకేష్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ప్రచారం సాగించారు.

పవన్ కళ్యాణ్ ప్రచారం ముగింపు రోజు సోమవారం తెలంగాణలో విస్తృతమైన ప్రచారం సాగించారు. నారా లోకేష్ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక వీరిద్దరు కూడా సీమాంధ్రపై దృష్టి కేంద్రీకరించనున్నారు. సీమాంధ్రలో పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధించే అవకాశం ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్

పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. బిజెపి, టిడిపి కూటమిని గెలిపించాలని ఆయన కోరుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్

పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్

నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారంనాడు రోడ్ షో నిర్వహించారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వాగ్బాణాలు విసురుతున్నారు.

నల్లగొండ జిల్లాలో పవన్ కళ్యాణ్

నల్లగొండ జిల్లాలో పవన్ కళ్యాణ్

తెలంగాణలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపి కూటమికి స్టార్ కాంపెయినర్ అయ్యారు. ఆయన సోమవారం నల్లగొండ జిల్లాలో టిడిపి, బిజెపి కూటమికి ప్రచారం సాగించారు

పవన్ కళ్యాణ్ టార్గెట్ కెసిఆర్

పవన్ కళ్యాణ్ టార్గెట్ కెసిఆర్

తెలంగాణ పర్యటనలో పవన్ కళ్యాణ్ తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. సీమాంధ్రలో ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+