ఎన్టీఆర్ ఎరాలోనూ..: 'ఈనాడు' రామోజీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదు. రామోజీ రావు పరిచయం అక్కరలేని ప్రముఖుడు. ఎంతటివారైనా తనంత తానుగా ఆయన ఎవరి వద్దకూ వెళ్లి కలవడమనేది ఇప్పటి వరకూ జరగలేదు.
అలాంటి రామోజీ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలవడానికి తెలంగాణ సచివాలయంలో సోమవారం సాయంత్రం కాలు పెట్టారు. దేశ ఉప ప్రధాని హోదాలో ఎల్‌కే అద్వానీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా రామోజీరావు ఆయన దగ్గరకు వెళ్లలేదు.
అద్వానీయే వచ్చి రామోజీరావును ఆయన కార్యాలయంలో కలిశారు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు కూడా సచివాలయానికి రాని రామోజీరావు.. ఇప్పుడు ఓం సిటీ విశేషాలతో రూపొందించిన పుస్తకం (కాఫీ టేబుల్ బుక్) తొలి ప్రతిని అందించేందుకు సచివాలయానికి వచ్చారు.

సచివాలయంలో రామోజీరావు....
రామోజీ రావు ఇప్పటి వరకూ సచివాలయం గడప తొక్కలేదు. సోమవారం ఆయన తెలంగాణ సచివాలయంలో కాలు పెట్టారు.

సచివాలయంలోకి రామోజీ రావు
రామోజీ రావు సచివాలయంలో కాలు పెట్టిన ఫొటోలను ఫేస్‌బుక్కులో పోస్టు చేస్తూ పలువురు పలు వ్యాఖ్యలు కూడా రాశారు.

సచివాలయంలో రామోజీరావు...
తెలంగాణ సచివాలయంలోకి రామోజీ రావు కాలు పెట్టడంపై సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సోమవారం సాయంత్రం నుంచి ఆయన ఫొటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తూ వస్తున్నాయి.

సచివాలయంలోకి రామోజీరావు
ఎవరినైనా ప్రత్యేక పరిస్థితిలో కలవాల్సి వస్తే రామోజీ ఫిలిం సిటిలో రామోజీ రావు కలిసే వారు. ఇటీవల కెసిఆర్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఆయనను కలిశారు.

సచివాలయంలో రామోజీ రావు...
తాను భారీగా తలపెట్టిన ఓం సిటీ గురించి చర్చించడానికే రామోజీ రావు సచివాలయంలో కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.












Click it and Unblock the Notifications