పవన్ కళ్యాణ్‌తో తీగల: బాబుతో హీరో రామ్ (పిక్చర్స్)
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెంతకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బారులు తీరుతుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్ద సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. శుక్రవారంనాడు పవన్ కళ్యాణ్‌ను తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు కలిశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని హీరో రామ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిశారు. ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కూడా కలిశారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే నేతగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలవారికి కనిపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు జూన్ రెండోవారంలో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పవన్ కళ్యాణ్‌తో తీగల
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి శుక్రవారం నాడు కలిశారు. హైదరాబాదులో పవన్ కళ్యాణ్ మద్దతు టిడిపికి అవసరమని ఆయన భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు సన్మానం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను టిడిపి ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి సన్మానించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని ఆయన చెప్పారు.

బాబుకు రామ్ అభినందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని హీరో రామ్ కలిసి అభినందనలు తెలిపారు.

బాబుతో కైకాల సత్యనారాయణ
ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

చంద్రబాబుతో హీరో రామ్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని హీరో రామ్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కలిశారు.

చంద్రబాబుతో అధికారులు..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్
రాష్ట్ర విభజన తీరుతెన్నులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
చంద్రబాబుతో మహంతితో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన తీరుపై వివరించారు.
-
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications